
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాలేశ్వరం ప్రాజెక్టులో ఎన్నో అవకతవకలు జరిగాయని ఆరోపించిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే కాలేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై పిసి గోష్ నివేదిక ఆధారంగా కేసీఆర్ పై ఎటువంటి చర్యలు కూడా తీసుకోకూడదు అని గతంలో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఈ గడువును పెంచుతున్నట్లుగా మరోసారి హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. 2026 జనవరి 19వ తేదీ వరకు కూడా కెసిఆర్ పై ఎటువంటి చర్యలు తీసుకోకూడదని వెల్లడించింది. కెసిఆర్ తో పాటుగా హరీష్ రావు, ఎస్కే జోషి, స్మిత సబర్వాల్ పై కూడా ఎటువంటి చర్యలు తీసుకోకూడదని హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే దీనిపై కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వం తరఫున న్యాయవాదికి నాలుగు వారాల సమయం అనేది కేటాయించింది. ఇక తదుపరి విచారణ అనేది జనవరి 19 తరువాతనే జరుగుతుంది అని తెలిపింది.
Read also : Entertainment: బీచ్‌లో అందాలను ఆరబోస్తూ రచ్చ చేస్తున్న రకుల్
Read also : Team India U19: టీమిండియాకు ఎంపికైన హైదరాబాద్ కుర్రాడు





