Homeజాతీయంఈనెల 26వ తేదీ నుంచి శుభకార్యాలు చేయొద్దు : వేద పండితులు

ఈనెల 26వ తేదీ నుంచి శుభకార్యాలు చేయొద్దు : వేద పండితులు

క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- శుక్ర మౌడ్యమి కారణంగా ఈనెల 26వ తేదీ నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 17వ తేదీ వరకు ఎవరూ కూడా శుభకార్యాలు చేయొద్దని పండితులు వేద స్మార్త గురురాజ్ శర్మ కీలక ప్రకటన చేశారు. ఈనెల 26 నుంచి ఫిబ్రవరి 17వ తేదీ వరకు అనగా దాదాపు 83 రోజుల వరకు శుక్ర మౌడ్యమి ఉంది అని.. తద్వారా ఈ సమయంలో ఎవరూ కూడా శుభకార్యాలు చేసుకోవద్దని సూచించారు. శుభాలకు అధిపతి అయినటువంటి గురువు మరియు శుక్రుడు ఈ మూడాల్లో సూర్యుడికి సమీపంగా రావడంతో శక్తిని కోల్పోతాయని వివరించారు. అలాగే ఈ 83 రోజులపాటు వాహనాలు కానీ, బోర్లు తవ్వించడం, గృహప్రవేశాలు చేయడం కానీ, పెళ్లిళ్లు కానీ, పుట్టు వెంట్రుకలు తీయడం గాని, యాత్రలకు వెళ్లడం వంటివి చేయకూడదు అని తెలిపారు. ఇక ప్రతిరోజు స్వామివారిని పూజించేటువంటి వారు అలాగే నిరంతరం సీమంతాలకు ఇటువంటి వాటికీ ఈ దోషం వర్తించదు అని పండితులు తెలిపారు. ఇప్పటివరకు ఎన్నో శుభకార్యాలు జరగగా ఈనెల 26వ తేదీ నుంచి.. ఫిబ్రవరి 17వ తేదీ వరకు మొత్తం 83 రోజులపాటు ఎవరూ కూడా దోషం కలిగినటువంటి శుభకార్యాలు చేయకూడదు అని వెల్లడించారు. ఒకవేళ వీటిని పాటించకుండా మీ ఇష్టానుసారం చేస్తే ఖచ్చితంగా దోషం తగ్గుతుందని కొంతమంది వేద పండితులు చెబుతున్నారు.

Read also : Intelligence Bureau: మీ కోసమే.. టెన్త్ అర్హతతో 362 ఉద్యోగాలు.. ఇవాళ్టి నుంచే దరఖాస్తులు

Read also : బంగ్లాదేశ్ లో భారీ భూకంపం.. 10మంది మృతి, 100 మందికి పైగా గాయాలు?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు