
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- 2027 వ సంవత్సరంలో వన్డే వరల్డ్ కప్ జరగనున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇప్పటినుంచి దాదాపు 2 ఏళ్ల సమయం ఉండగా… సోషల్ మీడియాలో ఇప్పుడే ఓపెనర్స్ పై చర్చ మొదలయ్యింది. వరల్డ్ కప్ టోర్నీలో ఓపెనింగ్ జోడి పై చర్చ జరుగుతున్న సందర్భంలో చాలామంది చాలా రకాలుగా ఈ ప్లేయర్స్ అయితే బాగుంటుంది అని చర్చలు కొనసాగిస్తున్నారు. ఒకవైపు టి20 అలాగే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించినటువంటి స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ ఆడుతాడా లేదా అనేది ప్రతి ఒక్కరికి ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. మరోవైపు గిల్ ఓపెనర్ గా అలాగే కెప్టెన్ గా ఖచ్చితంగా ఆడుతారు అని ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే గిల్ కు జోడిగా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ… వీరి ముగ్గురిలో ఎవరో ఒకరు మాత్రమే ఓపెనర్ గా కొనసాగే అవకాశాలున్నాయి. రోహిత్ శర్మ వరల్డ్ కప్ లో ఆడితే మాత్రం కచ్చితంగా అతనిది ఓపెనింగ్ స్థానమే ఉంటుంది. మరోవైపు జైశ్వాల్ అలాగే అభిషేక్ శర్మ ఇద్దరూ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. మరి ఇలాంటి తరుణంలో కొంతమంది జైష్వాల్ – గిల్ జోడి బాగుంటుందని, మరి కొంతమంది అభిషేక్ – గిల్ జోడి సూపర్ ఉంటుందని సోషల్ మీడియా వేదికగా కొంతమంది తమ అభిప్రాయాలను ఇప్పటినుంచే చెప్తున్నారు. మరి 2027 వన్డే వరల్డ్ కప్ వరకు వీరి ముగ్గురిలో ఎవరు గిల్ కు జోడిగా ఓపెనింగ్ చేస్తారనేది ప్రతి ఒక్కరిలోనూ ఒక ఆసక్తి అయితే నెలకొంది. ఫిట్నెస్ అలాగే ఫామ్ కనబరిస్తే ఖచ్చితంగా రోహిత్ శర్మ ఆడడానికి వీలుంటుందని ఇప్పటికే కోచస్ చెప్పారు. మరి మీ వరల్డ్ కప్పుకు దాదాపు రెండేళ్ల సమయం ఉండగా వీరిలో ఎవరిని ఆడిస్తారు అనేది అప్పటి వరకు వెయిట్ చేసి చూడాల్సిందే.
Read also : ఢిల్లీలో పొల్యూషన్ పంచాయతీ…?
Read also : ఢిల్లీలో గోరంగా పడిపోయిన గాలి నాణ్యత.. ఎంపీ సంజయ్ సింగ్ స్క్రీన్ షాట్ విడుదల?