
క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్ ప్రతినిధి :- మహాదేవ్ పూర్ మండలంలోని సూరారం గ్రామంలో నిర్లక్ష్యంగా నిర్వహిస్తున్న బేకరీ (రాజస్థాన్ స్వీట్ హౌస్..) పై గత శుక్రవారం వచ్చిన క్రైమ్ మిర్రర్ కథనానికి స్పందించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు శనివారం ఉదయం తనిఖీలు చేసారు. ఈ తనిఖీల్లో భాగంగా బేకరీ లో ఉన్న తిను బండారాలను మరియు కూల్ డ్రింక్స్ ను పరిశీలించడం జరిగింది, ఈ పరిశీలనలో డేట్ దాటిపోయిన కూల్ డ్రింక్స్ ను సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది. ఈ తనిఖీల్లో పాల్గొన్న ఫుడ్ ఇన్స్పెక్టర్ బ్రహ్మాజీ మాట్లాడుతూ.. సూరారం గ్రామంలోని బేకరీలో తినుటకు అనుమతించిన ఏ తినుబండారాలు నాణ్యమైనవి కావు అని, ప్రజలకు అమ్ముతున్న కూల్ డ్రింక్స్ సైతం డేటు దాడిపోయినవని, ఎలుకలు పిట్టలు పక్షులు పడిన పాలను సైతం అమ్మడం చట్టపరంగా నేరమని దీనిపై బేకరీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని మీడియాకు తెలిపారు.
తీన్మార్ మల్లన్న కేసు.. రేవంత్ సర్కార్ పై హైకోర్టు సీరియస్
ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రి ఇతడే!… డిసైడ్ చేయబోతున్న బిజెపి అధిష్టానం?