
నల్గొండ, క్రైమ్ మిర్రర్:-వరంగల్- ఖమ్మం- నల్లగొండ శాసన మండలి ఉపాధ్యాయ యం.ఎల్.సి ఎన్నికల కౌంటింగ్ కు అర్జాల బావి వేర్ హౌస్ గోడౌన్స్ నందు ఏర్పాటు చేసిన ఎన్నికల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా జరిగేందుకు అవసరమైన ముందస్తు ప్రణాళికతో పాటు ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత జిల్లా పరిధిలో ఏ చిన్నపాటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా దాదాపు 530 మంది అధికారులు, సిబ్బందితో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ అన్నారు.
పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా గంజాయి పట్టివేత…వాహనం సీజ్.. నిందితుడి అరెస్ట్!..
ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్బంగా కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో 163 బీఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమలులో ఉంటుందని నలుగురు కంటే ఎక్కువగా గుంపులు గుంపులుగా తిరగటం చేయకూడదని తెలిపారు. అదేవిధంగా అభ్యర్థులు, ఏజెంట్లు లెక్కింపునకు హాజరు అయ్యే అధికారులు సెల్ ఫోన్లు, నిషేధిత వస్తువుల అయిన అగ్గిపెట్టెలు, లైటర్, ఇంక్ బాటల్స్, లిక్విడ్, వాటర్ బాటిల్ , పేలుడుకు కారణమయ్యే ఎలాంటి వస్తువులను లెక్కింపు కేంద్రాల్లోకి తీసుకురాకూడదని తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద విధులకు హాజరయ్యే ప్రధాన ఏజెంట్లు/కౌంటింగ్ ఏజంట్లు/మీడియా ప్రతినిధులు ఎన్నికల అధికారి జారీచేసిన ఫోటో గుర్తింపు కార్డు తప్పక వెంట ఉంచుకొని తనిఖీలు చేసే పోలీసు సిబ్బందికి సహకరించాలని కోరారు.వాహనాలకు ట్రాపిక్ ఇబ్బంది కలగకుండా కేటాయించిన పార్కింగ్ స్థలం లోనే వాహానాలు పార్క్ చేయాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు పాటించాలని సూచించారు.