- కిడ్నాప్ వెనుక పలు కీలక నేతలు
- రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం
- క్యాంప్ పేరుతో తన భర్త కిడ్నాప్
- మాజీ ఎమ్మెల్యే, ఆయన తనయుడిపై అనుమానాలు
- కౌన్సిలర్ భార్య వసంత ఆరోపణ
ఇబ్రహీంపట్నం, క్రైమ్ మిర్రర్: ఇబ్రహీంపట్నం బీఆర్ ఎస్ పార్టీ 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన విషయం అందరికి తెలిసిందే.
దీనిని సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ హైకోర్టు యాదగిరిని న్యాయం స్థానం ముందు ప్రవేశపెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు దర్యాప్తులో భాగంగా బుధవారం యాదగిరిని కోర్టు ముందు హాజరు పరిచారు. దీంతోహైకోర్టు ఆయన ఆరోగ్యం, అదృశ్యం వెనుక ఉన్న కారణాలపై వివరణ కోరినట్లు తెలిసింది.
ప్లాన్‌తోనే నా భర్తను కిడ్నాప్ చేశారు…
పోలీసులకు ఫిర్యాదు...
నా భర్తను పక్కా ప్లాన్తోనే కిడ్నాప్ చేశారని, ఇది సాదారణ మిస్సింగ్ కాదని యాదగిరి భార్య వసంత మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మిస్సింగ్‌పై నాకు ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి , ఆయన తనయుడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అనుమానాలుఉన్నట్లు ఆరోపించారు. దీంతో బుధవారం ఆమె పోలీసులకు అధికారికంగా పిర్యాదు చేశారు.
దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని కిడ్నాప్‌కు గల కారణాలు, దీని వెనుక ఎవరైన వ్యక్తులు ఉన్నారా అనే వివిధ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఆరోపణలకు సంబంధించి ఏ నాయకుడి నుంచి కూడ అధికార ప్రకటన రాకపోవడం గమనర్హం. ఈ కిడ్నాప్ తతంగం గత రెండు రోజులుగా ఇబ్రహీంపట్నం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
