
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో ఒక పోలీస్ కానిస్టేబుల్ హత్యకు గురైన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. నిజామాబాద్ ప్రాంతంలోని ప్రమోద్ అనే కానిస్టేబుల్ ను రియాజ్ అనే నిందితుడు కత్తితో పొడిచి చంపిన విషయం, అలాగే పోలీస్ ఎంకౌంటర్లో నేడు రియాజ్ చనిపోయిన విషయం కూడా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే తాజాగా హత్యకు గురైనటువంటి కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి డిజిపి శివధర్ కోటి రూపాయలు పరిహారాన్ని ప్రకటించారు. అంతేకాకుండా ప్రమోద్ కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రమోద్ పదవి విరమణ వరకు వచ్చే శాలరీ అంతా కూడా ఒకేసారి అందజేస్తామని… వీటితోపాటుగా 300 గజాల ఇంటి స్థలాన్ని మంజూరు చేస్తామని తెలిపారు. ఇక మరోవైపు పోలీస్ భద్రత సంక్షేమం నుంచి 16 లక్షలు, పోలీస్ వెల్ఫేర్ నుంచి ఎనిమిది లక్షల పరిహారాన్ని రేపు అమరవీరుల సభలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటిస్తారని డిజిపి శివధర్ కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే కానిస్టేబుల్ ప్రమోద్ మృతి చెందిన కారణంగా అతని కుటుంబ సభ్యులు తీరని దుఃఖానికి లోనయ్యారు. తాజాగా డీజీపీ నష్టపరిహారం ప్రకటించగా… కుటుంబ సభ్యులకు కాస్తనైనా దుఃఖ భారం తగ్గేటటువంటి అవకాశం ఉంది. మరోవైపు చనిపోయిన వ్యక్తికి ఎన్ని కోట్లు వెలకట్టిన తక్కువే అని కామెంట్లు చేస్తున్నారు.
Read also : నూతన వరి నాటే మిషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్
Read also : దీపావళి వేళ కూటమి ప్రభుత్వంపై బాంబు పేల్చిన జగన్..!