Homeతెలంగాణఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకి కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు

ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకి కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు

ఆత్మకూరు,క్రైమ్ మిర్రర్:- యాదాద్రి భువనగిరి జిల్లా, ఆత్మకూరు మండల కేంద్రంలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న గ్రామ ప్రజల కళ అయిన డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు నిధులు కేటాయించి పనులను వేగవంతంగా చేయిస్తున్న ఆలేరు అభివృద్ధి ప్రదాత ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కాంగ్రెస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. మొదటి విడతగా 1కోటి 70లక్షలు,రెండో విడత 80 లక్షల(హై స్కూల్ వరకు సిసి రోడ్ నిర్మాణానికి )నిధులు కేటాయించడం జరిగింది. ఈ రోడ్డు నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి. మంగళవారం సిసి రోడ్ నిర్మాణ పనులను స్థానిక కాంగ్రెస్ నాయకులు పరిశీలించి ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యాస లక్ష్మారెడ్డి, మాజీ సర్పంచ్ జన్నాయికోడె నగేష్ పట్టణ కాంగ్రెస్ పార్టీ పోతగాని మల్లేశం గౌడ్,వార్డు సభ్యులు బూడిద శేఖర్ కాంగ్రెస్ నాయకులు జన్నాయికోడె యుగంధర్, గుండెగాని ఐలయ్య దొంతరబోయిన భాస్కర్, రంగస్వామి, నోముల యాదగిరి, రంగా శ్రీను,ఎలగందుల శ్రీనివాస్, తవిటి రాజు, కోరే మల్లేష్, మోలుగురీ సత్యనారాయణ తొండల అనిల్, యాస సుభాష్, గుండెగాని కిరణ్, లోడి మహేష్, యాస వెంకట్ రెడ్డి, కట్టే కోలా సి మ్మయ్య బాసాని శంకర్, పవన్ తదితరులు పాల్గొన్నారు.

మండల అధికారుల గైర్హజరు.. మునుగోడు ప్రజల ఆగ్రహం

Lok SabhaVideo: ఫిబ్రవరి 4న లోక్ సభలో ఏం జరిగింది? షాకింగ్ వీడియో రిలీజ్!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

Most Popular

Recent Comments