
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ బ్యూరో : రాజకీయ సమీకరణాల్లో మరో కీలక మార్పు చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి పెద్ద శ్రీశైలం యాదవ్ తమ్ముడు గౌతమ్ యాదవ్ బుధవారం అధికార భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీలో చేరారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గౌతమ్ యాదవ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Also Read:రేవంత్ లాంటి బలహీనమైన CM ను నా రాజకీయ చరిత్రలోనే చూడలేదు : కేటీఆర్
ఈ సందర్భంలో కేటీఆర్ మాట్లాడుతూ గౌతమ్ యాదవ్ లాంటి యువ నాయకుల రాకతో బీఆర్ఎస్ బలపడుతుంది. జూబ్లీహిల్స్ నుంచి బలమైన కేడర్, ప్రజా మద్దతుతో పార్టీ మరింత బలోపేతం అవుతుంది, అని పేర్కొన్నారు. గౌతమ్ యాదవ్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కేటీఆర్ నాయకత్వంలో పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాను.
జూబ్లీహిల్స్ అభివృద్ధే నా లక్ష్యం, అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తలసాని సాయి యాదవ్, నగేష్ ముదిరాజ్, స్థానిక కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. రాజకీయ వర్గాల్లో గౌతమ్ యాదవ్ బీఆర్ఎస్‌లో చేరికతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కొత్త రాజకీయ సమీకరణాలు చోటు చేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.