
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై రాష్ట్ర రాజకీయ నాయకులతో పాటుగా ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలు అయినటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్ మరియు బీజేపీ లకు చాలా కీలకము కానుంది. ఇప్పటికే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీలు స్పీడును పెంచుతూ ముందుకు దూసుకెళ్తూ ఉన్నాయి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మరోవైపు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఇద్దరు కూడా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా సర్వశక్తుల ప్రచారంలో ప్రజలకు దగ్గరవుతూ ఉన్నారు. కానీ ఈ సమయంలో బీజేపీ కూడా స్పీడ్ పెంచబోతుందా అనేది ఆసక్తికరంగా మారింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ స్పీడ్ పెంచాల్సి ఉంది. కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ పార్టీలతో పోలిస్తే బిజెపి ప్రచారంలో కాస్త వెనుకబడిందని చెప్పాలి. బీజేపీ పార్టీ తరఫున కిషన్ రెడ్డి, రామచంద్ర రావు, రఘునందన్ అలాగే కొండా విశ్వేశ్వర్ మినహా మిగతా నేతలు ఎవరూ కూడా ఈ క్యాంపియన్ లో కనిపించడం లేదు. దీంతో ప్రచారంలో కాస్త బిజెపి వెనుకబడిందని చెప్పాలి. మరోవైపు బండి సంజయ్, డీకే అరుణ, మహేశ్వర్ రెడ్డి, ఈటల, అరవింద వంటి బిజెపి ముఖ్య నేతలు ఇప్పటి వరకు ఈ ఎన్నికలకు కాస్త దూరంగా ఉన్నారు. మరి ఇవాళ నామినేషన్లు దాఖల చివరి రోజు కావడంతో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. మరి ఇప్పుడైనా ఇప్పటివరకు ప్రచారంలో పాల్గొనడానికి నాయకులు బయటకు వస్తారా?.. ప్రచారంలో పాల్గొంటారా?.. అభ్యర్థికి సపోర్ట్ గా నిలబడతారా?.. లేదా?.. అనే విషయం స్థానిక కార్యకర్తల్లో కూడా అయోమయంగా అలాగే ఉత్కంఠత నెలకొంది.
Read also : చాలా చీప్ గా టెస్ట్ టికెట్స్… అది కూడా భారత్ VS సౌత్ఆఫ్రికా మ్యాచ్?
Read also : రేవంత్ ప్రభుత్వంలో పోలీసులకే రక్షణ లేదు : హరీష్ రావు