Sunday, February 22, 2026
Homeతెలంగాణదొడ్లపహాడ్ సర్పంచ్ పై కలెక్టర్ కి పిర్యాదు

దొడ్లపహాడ్ సర్పంచ్ పై కలెక్టర్ కి పిర్యాదు

క్రైమ్ మిర్రర్,మాడ్గుల:- మాడ్గుల మండలం దొడ్లపహాడ్ సర్పంచ్ పై నెరా చరిత్ర ఉందని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన కాయితీ అభినందన్ రెడ్డి గెలిచిన అభ్యర్థి పై నెల రోజుల లోపే కోర్ట్ లో పిటిషన్ ధాఖలు చేసిన ఘటన ఆలస్యం గా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే తాజాగా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో దొడ్ల పహాడ్ గ్రామానికి జనరల్ రిజర్వేషన్ రావడం తో ముగ్గురు అభ్యర్థులు సర్పంచ్ బరిలో నిలిచారు. డిసెంబర్ 17 నా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పై 110 ఓట్ల మెజారిటీ తో బిఆర్ఎస్ అభ్యర్థి ముచర్ల ఇదమయ్య గెలుపొందరు.

సర్పంచ్ గెలిచిన అభ్యర్థి పది హేను రోజుల్లోనే ఒడి పోయిన అభ్యర్థి పై రివెంజు తీర్చుకోవడం కోసం గ్రామం లో గత ఐదు సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ నాయకులు అభినందన్ రెడ్డి వారి తల్లి దండ్రులు కాయితీ పద్మమ్మ, బాల్ రెడ్డి గార్ల పేరుపై గ్రామస్థుల ఆదేశాల మేరకు 12 లక్ష లరూపాయలతో గుడి ఆర్చి కట్టించాడు. ఎలాగైన ఆర్చి కూల్చి వేయాలని దురిద్దేశం తో సర్పంచ్ గ్రామస్తులను గుడి వద్దకు తీసుకెళ్లి చర్చలు జరపడం తో ఆ విషయం గ్రామం లో అందరికి పాకిపోయింది. ఇదిలా ఉందని సర్పంచ్ గెలుపొందిన వారి పై పలు క్రిమినల్ కేసులు వున్నావని వాటిని ఎన్నికల అఫిడవిట్ లో నమోదు చేయలేదని నెల రోజులు గడవక ముందే ఎన్నికల కమిషన్, కోర్ట్ ని ఆశ్రయించి సర్పంచ్ పై పిటిషన్ దాఖలు చేశాడాని గ్రామస్థులు పేర్కొన్నారు. శనివారం అభినందన్ రెడ్డి న్యాయవాధులతో కలిసి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కి ఇచ్చిన పిర్యాదు లో క్రిమినల్, నేర చరిత్ర వున్నా ఎన్నికల అఫిడవిట్ లో తెలియపర్చకుండా ఎన్నికల నిబంధాలను ఉల్లంగించిన సర్పంచ్ పై చర్యలు తీసుకొని పదవి నుండి తొలగించాలని పేర్కొన్నట్లు ఆయన తెలిపారు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments