తెలంగాణ

వరుసగా నాలుగో రోజు మూతపడిన కాలేజీలు.. 5000 కోట్లు చెల్లిస్తేనే ఓపెన్ చేస్తాం : FATHI

క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రైవేట్ కాలేజీలు మూతపడి నేటికీ నాలుగు రోజులవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ మరియు ఫార్మసీ తదితర ప్రొఫెషనల్ కాలేజీలు మూతపడ్డాయి. నవంబర్ 3వ తేదీన అన్ని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి అని ఏకంగా కాలేజీలను కూడా బంద్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 10 వేల కోట్ల రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాల్సి ఉండగా.. అందులో 5000 కోట్లు విడుదల చేసే వరకు ఈ బంద్ ఇలానే కొనసాగుతుంది అని ప్రైవేట్ యాజమాన్య సంఘాలు స్పష్టం చేశాయి. ఇక మిగతా 5000 కోట్లు ప్రతి నెల కూడా 500 కోట్ల చొప్పున 10 నెలల్లో విడుదల చేయాలి అని FATHI కోరింది.

Read also : నేడే నాలుగవ టి20.. ముందంజలోకి ఎవరు వెళ్తారు?

ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకపోవడంతో అన్ని కాలేజీల్లోని అధ్యాపకులకు కనీస జీతాలు ఇవ్వలేకపోతున్నామంటూ ప్రైవేట్ యాజమాన్య సంఘాలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. ఎన్నో కష్టాలు ఉన్నాయి కాబట్టే రాష్ట్రవ్యాప్తంగా బందుకు దిగాల్సి వచ్చింది అని పేర్కొన్నారు. కాగా ఇప్పటికే నాలుగు రోజులపాటు బంద్ కొనసాగుతుండగా.. అన్ని కాలేజీలు మూతపడ్డాయి. కొన్ని పరీక్షలు అయితే ఏకంగా బహిష్కరించడం కూడా జరిగింది. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు బంద్ నిర్వహిస్తున్న కూడా ప్రభుత్వాధికారులు కమిటీలు అంటూ కాలయాపన చేస్తూ ఈ విషయాన్ని పక్కన పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది విద్యార్థులు అలాగే ఉపాధ్యాయులతో నిరసనలు వ్యక్తం చేస్తామని FATHI ఇప్పటికే హెచ్చరించింది.

Read also : అనుమానం కలిగితే బురఖా తీయాల్సిందే.. ఇది పాకిస్తాన్ కాదు : కేంద్రమంత్రి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button