తెలంగాణలో రైతు రుణమాఫీనే ప్రధాన అంశంగా మారింది. ఆగస్టు 15 లోపే అందరికి 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మూడు విడతల్లో రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేశారు. చెప్పినట్లే రెండు లక్షల రుణమాఫీ చేశామని ప్రకటించారు. కాని క్షేత్రస్థాయిలో మాత్రం దాదాపు సగం మంది రైతులకు రుణమాఫీ కాలేదు. కేవలం 22 లక్షల మందికే రుణమాఫీ జరిగినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. మరో 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయాల్సి ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ప్రకటించారు. రేషన్ కార్డు లేకపోవడం, కుటుంబంలో ఎక్కువ లోన్ ఉండటం, 2 లక్షలకు పైగా రుణం ఉండటం వంటి కారణాలతో దాదాపు 20 లక్షల మందికి రుణమాఫీ కాలేదు.
రుణమాఫీ కాని రైతులు గత మూడు నెలలుగా ఆందోళన చేస్తున్నారు. రోజూ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారు. దీంతో ఎలాగైనా మిగితా రైతులకు రుణమాఫీ చేయాలనే యోచనలో రేవంత్ సర్కార్ ఉంది. అయితే తాజాగా రుణమాఫీకి సంబంధించి రైతులకు గుడ్ న్యూస్ చెప్పబోతోంది రేవంత్ సర్కార్.
పూర్తిస్థాయి రుణమాఫీపై కొద్ది రోజులుగా గందరగోళం నడుస్తోంది. కొంతమంది రైతులకే రుణమాఫీ కావటంతో కాంగ్రెస్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదురవుతున్నాయి. దీనికి తోడు అసలు రుణమాఫీ అన్నదే జరగలేదు అన్నట్లుగా బీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఎటాక్ కు దిగుతున్నారు. ఈ టైంలో రైతులకు పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. సర్కార్ తల తాకట్టు పెట్టి అయినా సరే డిసెంబర్ లో పూర్తి స్థాయి రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. తాము ఇంకా 13వేల కోట్ల రూపాయల రుణమాఫీ చెయ్యాల్సి ఉందన్నారు. మరోవైపు బర్త్ డే సందర్భంగా రైతులతో మాట్లాడనున్న సీఎం రేవంత్ రెడ్డి…డిసెంబర్ లో పూర్తి స్థాయి రుణమాఫీపై ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి ….
విద్యార్థిని తొడ కొరిగిన టీచర్.. ఇంట్లో చెప్తే చంపేస్తా అంటూ బెదిరింపులు
తలకాయే తీసేసారు.. రాహుల్ పర్యటన రోజే దారుణం
భార్యపై కోపంతో కారు యాక్సిడెంట్ చేసిన వ్యాపారి
సీఎం రేవంత్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం స్పెషల్ విషెస్