
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత రెండు రోజుల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుబాయ్ నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం దుబాయ్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై ఫోకస్ పెట్టారు. భారీ వర్షాలు నేపథ్యంలో అధికార యంత్రాంగాలు ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులపై ఆరా తీస్తూ లోతట్టు ప్రాంతాలపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశించారు. భారీ వర్ష ప్రభావిత జిల్లాలు అయినటువంటి ప్రకాశం, నెల్లూరు, బాపట్ల, కడప మరియు తిరుపతి జిల్లాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని అధికారులకు దిశ నిర్దేశం చేశారు. ఈ జిల్లాలకు ప్రత్యేకంగా NDRF మరియు SDRF బృందాలను పంపించి ఎప్పటికప్పుడు ప్రజల పరిస్థితులపై ఒక కన్నేసి ఉంచాలని సూచించారు. రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్మెంట్, పోలీస్, ఇరిగేషన్, మునిసిపల్, విద్యుత్ శాఖలో చేసే ప్రతి ఒక్కరు కూడా ఈ భారీ వర్షాలు నేపథ్యంలో సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరి ముఖ్యంగా కోస్తాంధ్ర మరియు రాయలసీమ జిల్లాలలో రెండు రోజుల నుంచి ఆగకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు దుబాయ్ పర్యటనలో ఉండగా అక్కడి నుంచే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read also : బాలకృష్ణ పై ఫైర్ అయిన జగన్… తాగిన వ్యక్తులను కూడా అసెంబ్లీకి రానిస్తారా?
Read also : మహిళల ప్రపంచ కప్ లో రికార్డులు సృష్టించిన మహిళలు.. ఓపినర్స్ ఇద్దరూ సెంచరీలే!





