Wednesday, March 25, 2026
Homeఆంధ్ర ప్రదేశ్మ‌హా శివ‌రాత్రి మ‌హోత్స‌వానికి సీఎం చంద్ర‌బాబుకు ఆహ్వానం

మ‌హా శివ‌రాత్రి మ‌హోత్స‌వానికి సీఎం చంద్ర‌బాబుకు ఆహ్వానం

అమరావతి,క్రైం మిర్ర‌ర్‌

మహా శివరాత్రి సందర్భంగా ఈనెల 8వ తేదీ నుంచి 18 వరకు శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకొని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఆలయ బోర్డు ఛైర్మన్ రమేష్ నాయుడు, ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు సీఎం చంద్ర‌బాబు నాయుడు క్యాంప్ కార్యాల‌యంలో క‌లిసి మ‌హాశివ‌రాత్రి మ‌హోత్స‌వాల‌కు రావాల‌ని ఆహ్వానించారు.

శివ‌రాత్రి మ‌హోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను సీఎం చంద్రబాబుకు అందజేశారు. ఆలయ పండితులు వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వచనం ఇచ్చారు.

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఎమ్మెల్యే, ఆలయ బోర్డు సభ్యులు సీఎంకు వివరించారు. భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, భద్రత, రవాణా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు.

అదే విధంగా మహానందిలో జరిగే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు కూడా సీఎం చంద్రబాబును ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ఆహ్వానించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments