Tuesday, February 17, 2026
Homeఆంధ్ర ప్రదేశ్పిల్లలకు 4 గోడల మధ్య చదువు మాత్రమే ముఖ్యం కాదు : నాగబాబు

పిల్లలకు 4 గోడల మధ్య చదువు మాత్రమే ముఖ్యం కాదు : నాగబాబు

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థుల చదువులపై తాజాగా జనసేన కీలక నేత ఎమ్మెల్సీ నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతిరోజు పిల్లలకు స్కూళ్లలో చదువుతోపాటు ఫిజికల్, ఫిట్నెస్,మార్షల్ ఆర్ట్స్, సెల్ఫ్ డిఫెన్స్ మరియు యోగా లాంటివి నేర్పించాలి అని ప్రభుత్వాన్ని అలాగే విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేశారు. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో అన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ పిల్లలు ఎక్కువగా చదవడం వల్ల ఒత్తిడికి గురవుతున్నారు అని అన్నారు. కాబట్టి వారంలో కనీసం మూడు రోజులు పాటైనా ఇతర ఆటలపై శిక్షణ లాంటివి ఇవ్వాలి అని సూచించారు. యువత కేవలం చదువుకు మాత్రమే కాకుండా ఇతర యాక్టివిటీస్ కి కూడా సమయం కేటాయించాలి అని అన్నారు. ఈ మధ్యకాలంలో విద్యార్థులు చదువు పట్ల ఒత్తిడికి గురై ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అని మరోసారి గుర్తు చేశారు. కేవలం స్కూళ్లలో చదువులు మాత్రమే కాకుండా ఇతర యాక్టివిటీస్ పై కూడా మొగ్గు చూపగలిగితే ఎంతో కొంత ఒత్తిడి తగ్గుతుంది అని తెలిపారు. మానసికంగా అలాగే శారీరకంగా పిల్లలు కుంగిపోకుండా ఉండాలి అంటే కచ్చితంగా వ్యాయమము,యోగా అలాగే ఇతర ఆటలలో పాల్గొనేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. టీచర్లు కూడా ఈ విషయంలో కాస్త ముందు చూపుతో అడుగు వేయాలి అని శాసనమండలిలో భాగంగా నాగబాబు తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ప్రజా భవన్ ఎదుట కల్వకుంట్ల కవిత ఆందోళన

దిగొస్తున్న బంగారం ధరలు

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments