
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- సత్య సాయి బాబా గురించి గత రెండు రోజుల నుంచి ప్రతి ఒక్కరు కూడా చాలా గొప్పగా వివరిస్తూ వస్తున్నారు. స్టార్ క్రికెటర్లు, మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు అలాగే ప్రధానమంత్రి తో సహా ఎంతోమంది సెలబ్రిటీలు సైతం ప్రతి ఒక్కరు కూడా సత్య సాయి బాబా ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు కూడా చేయలేని పనులను సత్యసాయిబాబా ట్రస్ట్ నెరవేర్చింది అని ప్రశంసించారు. చిన్నపిల్లల చదువు నుంచి పీజీ వరకు కూడా పేదలకు ఉచితంగా విద్యను అందించడమే కాకుండా లక్షలాదిమందికి వైద్య సహాయం చేసినటువంటి ఘనత ఆయనకే దక్కుతుంది అని కొనియాడారు. పాలమూరు వంటి వలస జిల్లాలకు తాగునీటి సదుపాయం కల్పించిన వ్యక్తి సత్య సాయి బాబా అని అన్నారు. ఇక మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా సత్య సాయి బాబా సిద్ధాంతాలను మెచ్చుకున్నారు. సత్యం, ధర్మం, ప్రేమ, శాంతి మరియు అహింసా వంటి ఐదు సిద్ధాంతాలుగా సత్య సాయి బాబా నూతన అధ్యాయాన్ని ప్రారంభించారని అన్నారు. తన మహిమలతో అన్ని మతాలు కూడా ఒకటేనని భక్తులకు ప్రత్యక్షంగా నిరూపించిన వ్యక్తి అని ప్రశంసించారు. ఇంకోవైపు కేంద్ర మంత్రులతో సహా ప్రధానమంత్రి కూడా ఈ సత్య సాయి బాబా సిద్ధాంతాలను ప్రశంసించారు. మరోవైపు ప్రధానమంత్రి మోడీ సైతం సత్యసాయిబాబా మహిమలను కొనియాడారు.
Read also : నా కొడుకుని కాదు.. ముందు నిన్ను ఎన్కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది!
Read also : వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై ఫేక్ వ్యక్తులు చెప్పే ఫేక్ మాటల్ని నమ్మకండి : TDP





