
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఐపీఎల్ 18వ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పూర్తిగా విఫలమైంది. ఇప్పటికీ ఆరు మ్యాచ్లు ఆడగా కేవలం ఒక మ్యాచ్ మాత్రమే విజయం సాధించింది. దీంతో సోషల్ మీడియా వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై విపరీతంగా ట్రోల్స్ మొదలయ్యాయి. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అంటే ఎంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. జట్టుకు ధోని సారధ్యం వహిస్తూ ఎంతోమంది ప్రేక్షకులను కూడగట్టి ఏకంగా ఐదు ట్రోఫీలను అందజేశాడు. ఆ తరువాత యంగ్ ప్లేయర్ రుతురాజు గైక్వాడ్కు సారధ్య బాధ్యతలను అప్పగించింది. ఇక అప్పటినుండి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓటములను ఎక్కువగా చవిచూస్తోంది. అయితే ఈ సీజన్లో ఇప్పటివరకు కేవలం ఒక మ్యాచ్ మాత్రమే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గెలిచింది. ఇక తాజాగా మోచేతి గాయంతో కెప్టెన్ ఋతురాజు గైక్వాడ్ ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యారు. దీంతో మళ్లీ కెప్టెన్గా ఎమ్మెస్ ధోని ని నియమించింది యాజమాన్యం.
నిన్న రాత్రి ధోని కెప్టెన్సీలో కోల్కత్తా నైట్ రైడర్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తలపడింది. చెన్నై జట్టులో ప్లేయర్స్ అందరూ కూడా ఫామ్ లేమీతో మళ్లీ ఇబ్బంది పడ్డారు. దీంతో మళ్లీ తడబడిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేస్తూ కేవలం 13 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో సరికొత్త చెత్త రికార్డును నమోదు చేసుకుంది చెన్నై జట్టు. అనంతరం చేదనకు
దిగిన కోల్కత్తా జట్టు కేవలం 10 ఓవర్లలోనే మ్యాచ్ను అయిపోగొట్టేశారు. మ్యాచ్ ఓడిన అనంతరం చెన్నై జుట్టు ఫ్యాన్స్ కూడా చాలా ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్పటి చెన్నై జట్టు, ఇప్పటి చెన్నై జట్టు చాలా వేరని అంటున్నారు. మ్యాచ్ అనంతరం కెప్టెన్ ధోని ఓటమిపై స్పందించారు. ఓపినర్లు అద్భుతంగా ఆడితే మిడిల్ ఆర్డర్ మరింత స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలరని అన్నాడు. కాబట్టి ఓపెనర్లు మంచిగా రానించకపోవడంతోనే మ్యాచ్ ఓడిపోయామని అన్నారు. కాన్వే మరియు రచిన్ రవీంద్ర ఇద్దరు కూడా ప్రామాణికమైన క్రికెట్ షాట్లు మాత్రమే ఆడుతారు. హద్దులు దాటి కొట్టడానికి ప్రయత్నించరు అంటూ ఓపినర్లపై ధోని విమర్శలు చేశాడు.