క్రైమ్ మిర్రర్ తెలంగాణ బ్యూరో: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (NH-65)ని ప్రస్తుతం ఉన్న నాలుగు వరుసల నుంచి ఆరు వరుసలకు విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం సుమారు రూ. 10,391 కోట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
మొత్తం 229 కిలోమీటర్ల మేర (40వ కిలోమీటర్ పాయింట్ నుండి 269వ కిలోమీటర్ పాయింట్ వరకు) ఈ విస్తరణ పనులు చేపట్టనున్నారు. కేంద్ర రహదారి రవాణా శాఖ ఈ విస్తరణకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ కోసం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అధికారులను నియమిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Also Read:తెలంగాణలో మరో బస్సు ప్రమాదం..!
భూసేకరణ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది.ఈ రహదారిని హై సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత స్మార్ట్ రోడ్డుగా మార్చాలని యోచిస్తున్నారు. ఇందులో భాగంగా 231 అత్యాధునిక సీసీ కెమెరాలు, సోలార్ వీధి దీపాలు వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయనున్నారు.
ఈ విస్తరణ పూర్తయితే హైదరాబాద్ మరియు విజయవాడ మధ్య ప్రయాణ సమయం సుమారు 2 గంటలు తగ్గుతుందని, ప్రమాదాలు కూడా గణనీయంగా తగ్గుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
Also Read:న్యూ గర్ల్ ఫ్రెండ్ తో చిల్ అవుతున్న ఆల్ రౌండర్ హార్దిక్..!
టెండర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత, 2026 ఫిబ్రవరిలో పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి తెలిపారు.
Also Read:థియేటర్లలో తినుబండారాల ధరల పై సుప్రీంకోర్టు ఆగ్రహం!
Also Read:కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాసంస్థల పట్ల ప్రవర్తిస్తున్న తీరుపై బండి సంజయ్ ఫైర్