ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి

  • కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి
  • డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క

మధిర, క్రైమ్ మిర్ర‌ర్ః
రాష్ట్ర‌వ్యాప్తంగా జ‌రుగుతున్న కార్పొరేష‌న్‌,మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ప్ర‌జాభుత్వాన్ని ఆద‌రించి ఓటువేసిభారీ మెజార్టీతో గెలిపించాల‌ని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

బుధవారం మధిర పట్టణంలోని తొమ్మిదవ వార్డులో తన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం విలేక‌రు స‌మావేశంలో మాట్లాడారు. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద‌పీట వేస్తున్న‌ట్లు తెలిపారు.

2047 కల్లా 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా రాష్ట్రాన్ని తీర్చిదిదెందుకు క్యూర్‌ ప్యూర్, రేర్ కోర్ అర్బన్, ఫెరి అర్బన్, రూరల్ అగ్రికల్చర్ ఎకానమీ విభాగాలుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు పోతున్నామని తెలిపారు.

పట్టణాల్లో మురుగునీటిని శుభ్రం చేసేందుకు పెద్ద సంఖ్యలో ఎస్టిపిలను నిర్మాణం చేస్తున్నామన్నారు. చెరువుల ను ఆక్రమణదారుల నుంచి విముక్తి కల్పించి పార్కులు, చెరువులను టూరిజం ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.

విద్యుత్తు సరఫరాలో రెప్పపాటు అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేస్తున్నామని, పేద కుటుంబాలకు ఆసరాగా ఉండేందుకు ₹200 యూనిట్ల వరకు విద్యుత్తు ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు.

మా ప్రభుత్వం వచ్చాక 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని, పేద బిడ్డలకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో విద్యను అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని తెలిపారు.

ఒక్కో పాఠశాలను 25 ఎకరాల్లో 200 కోట్లతో అన్ని నియోజకవర్గాల్లో నిర్మిస్తున్నామని అన్నారు. ఇండ్లు లేని నిరుపేద‌ల‌కు ఇండ్లు ఇస్తున్నం అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button