తెలంగాణ

సమగ్ర కులగణన సర్వే 95 శాతం పూర్తి

దేశానికే ఆదర్శంగా తెలంగాణలో చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ కులగణన సర్వే 15 జిల్లాల్లో నూటికి నూరు శాతం పూర్తయిందని ప్రభుత్వం ప్రకటించింది. సామాజిక సాధికారత లక్ష్యంగా అన్ని వర్గాలకు సమానమైన అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్తర ప్రయత్నం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోందని వెల్లడించింది.

ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటివరకు రాష్ట్రంలో 94.9 శాతం సర్వే పూర్తయింది. నవంబర్ 6వ తేదీన మొదలైన ఈ సర్వే ద్వారా 27 రోజుల్లో 1,11,49,488 కుటుంబాల గణన పూర్తి చేశారు. వీటిలో 79,63,637 కుటుంబాల డేటా ఎంట్రీ కూడా పూర్తయింది. దాదాపు 67.8 శాతం డేటా ఎంట్రీ జరిగింది. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లో మంగళవారం నాటికి 15 జిల్లాల్లో వందకు వంద శాతం సర్వే పూర్తయింది.

ములుగు, నారాయణపేట, రాజన్న సిరిసిల్ల, జనగాం, ఖమ్మం, నల్గొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, మహబూబాబాదు, పెద్దపల్లి, మెదక్, వనపర్తి, కుమరంభీం ఆసిఫాబాద్, భద్రాచలం కొత్తగూడెం జిల్లాలు వంద శాతం సర్వే పూర్తయిన జాబితాలో ఉన్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలందరి అభ్యున్నతికి ఉపయోగపడుతుందని, రాష్ట్రంలో చేపట్టే కుల గణన దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు అన్ని వర్గాలు సర్వేలో పాలుపంచుకున్నాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది.

మరిన్ని వార్తలు చదవండి…

బన్నీ కోసం రంగంలోకి పవన్.. సంబరాల్లో మెగా ఫ్యాన్స్ 

జీ న్యూస్ రిపోర్టర్‌పై జనసేన ఎమ్మెల్యే హత్యాయత్నం!.. పవన్ సీరియస్

అల్లు అర్జున్ పై సెటైరికల్ ట్వీట్ చేసిన ఆంధ్ర ఎంపీ?… అసలు ఏమైందో తెలుసా?

కుండపోత వానలు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు

డిసెంబర్ 3న టీడీపీలోకి తీగల.. ఆయనతోనే ఆకుల అర్వింద్ కుమార్

జనవరిలో సర్పంచ్ ఎన్నికలు.. ముగ్గురు పిల్లల్లున్నా పోటీ చేయొచ్చు

నాగబాబుకి కీలక పదవి…ఢిల్లీ వెళ్ళిన పవన్ కళ్యాణ్?

అయ్యప్ప స్వాములకు బ్రీత్ అనలైజర్ టెస్ట్.. ఆర్టీసీలో దుమారం 

ఫుడ్ పాయిజన్‌తో 38 మంది విద్యార్థులు మృతి.. తెలంగాణలో ఘోరం 

కోటి 10 లక్షల ఇండ్లలో సమగ్ర సర్వే పూర్తి

సీఎం రేవంత్ జిల్లా మరో దారుణం.. పిల్లల సాంబారు,చట్నీలో బొద్దింక

అయ్యప్ప మాలలో కడప దర్గాకు రాంచరణ్

కుర్ కూరే తినడం వల్లే పిల్లలకు అస్వస్థత.. హైకోర్టుకు సర్కార్ రిపోర్ట్

ఆర్జీవి కోసం ఏకంగా రెండు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు!

8 నెలల తర్వాత కవిత ఫవర్ ఫుల్ స్పీచ్.. సీఎం రేవంత్‌కు టెన్షన్

రేవంత్ రెడ్డికి రాహుల్ క్లాస్.. అదాని 100 కోట్లు రిటర్న్

గజగజ వణుకుతున్న జనాలు.. తెలంగాణలో చలి పంజా

పాతబస్తీలో నేను చెప్పిందే ఫైనల్.. మేయర్‌కు MIM ఎమ్మెల్యే వార్నింగ్

Back to top button