
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:-
ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలు చేస్తూ కొన్ని కోట్ల మంది ఫాలోవర్లను సొంతం చేసుకున్న నా అన్వేషణ అనే యూట్యూబర్ కు నేడు బిగ్ షాక్ తగిలింది. నా అన్వేషణ అనే యూట్యూబర్ అన్వేష్ తాజాగా నటుడు శివాజీ వ్యాఖ్యలపై స్పందిస్తూ దేవతలు మరియు మహిళలను కించపరిచేలా అసభ్యకరంగా మాట్లాడారు. యూట్యూబర్ అన్వేష్ ను వెంటనే అరెస్టు చేయాలి అని.. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని తాజాగా విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. హిందూ దేవతలను అలాగే ఎంతో మంది భారత మహిళల వస్త్రధారణ పై అన్వేష్ చేసినటువంటి అసభ్యకర వ్యాఖ్యలకు గాను విశ్వహిందూ పరిషత్ గోపాలపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ప్రవచన కర్త గరికిపాటి పై కూడా పచ్చి బూతులు తిట్టారు. మరోవైపు హిందువులపై అతి దారుణంగా వ్యాఖ్యానించిన నా అన్వేషణ ఈ సందర్బంగా చాలా మంది ఫాలోవర్లను కూడా కోల్పోయారు. నిన్న మొన్నటి వరకు అన్వేష్ పై ఎంతో కొంత మర్యాద ఉంది అని నేడు హిందువులపై మాట్లాడిన వ్యాఖ్యలకు పూర్తిగా గౌరవం పోయింది అంటూ కొన్ని లక్షల మంది ఫాలోవర్లు అతన్ని అన్ ఫాలో చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియా లో అతని ఫాన్స్ ఏ అతనిని గోరంగా తిడుతూ అన్ ఫాలో చేస్తున్నారు.
Read also : రాత్రిపూట సరిగా నిద్ర పట్టట్లేదా.. అయితే ఈ పని చేయండి?
Read also : అలా మాట్లాడకుండా ఉండాల్సింది.. నాగబాబుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న mega ఫ్యాన్స్





