
నల్లగొండ,క్రైమ్ మిర్రర్:- శాంతి భద్రతల పరిరక్షణలో అంకితభావంతో విధులను నిర్వహిస్తూ, వృత్తి పట్ల నిబద్ధత చాటుకున్న నల్లగొండ రూరల్ ఎస్సై సైదా బాబును జిల్లా యంత్రాంగం గౌరవించింది. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని, జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు ‘ఉత్తమ సేవా ప్రశంసా పత్రాన్ని’ అందజేశారు. జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ల చేతుల మీదుగా ఎస్సై సైదాబాబు ఈ గౌరవాన్ని అందుకున్నారు. నల్లగొండ రూరల్ పరిధిలో శాంతి భద్రతలను కాపాడటంలో కీలక పాత్ర పోషించారు సైదాబాబు. తన పరిధిలోని నేరాలను అదుపు చేయడంలో ప్రత్యేక చొరవ చూపుతూ, ప్రజా స్నేహపూర్వక పోలీసింగ్ తో పాటు, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, బాధితులకు సత్వర న్యాయం అందించడంలో అంకితభావంతో పని చేసినందుకు గాను ఈ పురస్కారం అందుకున్నారు. నల్లగొండ రూరల్ ఎస్సై సైదా బాబు పురస్కారం అందుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ, తన సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసిన, జిల్లా ఉన్నతాధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ పురస్కారం తనపై బాధ్యతను మరింత పెంచిందని, భవిష్యత్తులో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ, శాఖాపరంగా జిల్లాకు మంచి పేరు తీసుకువస్తానని ఆయన పేర్కొన్నారు.
అభిమానుల అభినందనల జల్లు..
ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న సైదా బాబుకు తోటి పోలీస్ అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు అభినందనలు తెలియజేశారు. ఆయన మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. సైదాబాబు అంటేనే లాఅండ్ ఆర్డర్ కట్టుదిట్టం చేసే, నిఖార్సైన పోలీస్ గా ఆయనకు పెట్టింది పేరు.
Read also : UAE Cancels Pak Deal: భారత్ తో కీలక సంబంధాలు.. పాక్ కు షాకిచ్చిన యూఏఈ!





