Thursday, March 12, 2026
Homeక్రీడలుఐపీఎల్ నుంచి ఆర్సీబీ బ్యాన్, బీసీసీఐ కీలక నిర్ణయం!

ఐపీఎల్ నుంచి ఆర్సీబీ బ్యాన్, బీసీసీఐ కీలక నిర్ణయం!

BCCI Planning To Ban RCB From IPL: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) విజయోత్సవ వేడుకల సందర్భంగా జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో  భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.   బీసీసీఐ మౌనంగా ఉండదన్న కార్యదర్శి దేవజిత్ సైకియా.. కీలక నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలిపింది.

బెంగళూరు తొక్కసలాటలో 11 మృతి

ఐపిఎల్ 2025 విజేతగా నిలిచిన తర్వాత జూన్ 4న బెంగళూరులో విజయోత్సవ వేడుకలు జరిగాయి. ఇప్పటి వరకు ఐపీల్ 18వ సీజన్లు జరగగా, తొలిసారి ఆర్సీబీ కప్ కొట్టింది. బెంగళూరులో భారీ ఎత్తున విజయోత్సవ వేడుకలు నిర్వహించారు.  అయితే, సంతోషకరమైన సందర్భం కాస్తా విషాదకరంగా మారింది. వేడుకల సమయంలో, పెద్ద సంఖ్యలో జనం గుమిగూడటంతో తొక్కిసలాట జరిగింది. 11 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు.

బీసీసీఐ ఏం చేయబోతోంది?

ఈ ఘటన నేపథ్యంలో బీసీసీఐ సెక్రెటరీ దేవజిత్ సైకియా కీలక విషయాలు వెల్లడించారు. భవిష్యత్తులో ఐపీఎల్‌లో ఛాంపియన్‌ షిప్ తర్వాత జరిగే వేడుకలను నియంత్రించడానికి  చర్యలు తీసుకోవాలని యోచిస్తోందన్నారు. ఈ వేడుకను ఆర్సీబీ ప్రైవేట్ ఈవెంట్‌గా నిర్వహించినప్పటికీ, ఇలాంటి విషాదాలు మళ్లీ జరగకుండా నిరోధించడానికి బీసీసీఐ కట్టుబడి ఉందన్నారు. ఏదో ఒక దశలో బీసీసీఐ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. మన ప్రేక్షకుడిగా చూస్తూ ఉండలేమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవడానికి ప్రయత్నిస్తామన్నారు.

తొక్కిసలాట కేసులో నలుగురు అరెస్ట్

ఈ తొక్కిసలాట ఘటనకు సంబంధించి బెంగళూరులోని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో ఆర్‌సిబి, ఈవెంట్ మేనేజర్ డిఎన్‌ఎ ఎంటర్‌టైన్‌మెంట్, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అడ్మినిస్ట్రేటివ్ కమిటీతో సహా పలువురిపై కేసు నమోదు అయ్యింది. ఈ సంఘటన తర్వాత, నిఖిల్ సోసాలే (RCB మార్కెటింగ్ అండ్ రెవెన్యూ హెడ్), సునీల్ మాథ్యూ (బిజినెస్ అఫైర్స్ వైస్ ప్రెసిడెంట్), కిరణ్ కుమార్ (సీనియర్ ఈవెంట్ మేనేజర్), సుమంత్ (DNA ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌లో టికెటింగ్ ఆపరేషన్స్ లీడ్) సహా నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా త్వరలోనే నివారణ చర్యలు చేపట్టనున్నట్లు బీసీసీఐ సెక్రెటరీ దేవజిత్ సైకియా వెల్లడించారు.

Read Also: బెంగళూరు తొక్కిసలాట రచ్చ, కొందరి అరెస్ట్, మరికొందరిపై వేటు!

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments