
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేట్ యాజమాన్యాలు బంద్ నిర్వహిస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాసంస్థలపై ప్రవర్తిస్తున్న తీరు పట్ల తాజాగా కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యావ్యవస్థను పూర్తిగా నీరుగార్చుతోందని తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా 2500 విద్యాసంస్థలు మూతపడ్డాయి అంటే కాంగ్రెస్ పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవాలి అని ప్రజలకు సూచించారు. ఇక గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రెండేళ్లు.. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో రెండేళ్లు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు రాక ఒకవైపు స్టూడెంట్స్ మరోవైపు ప్రైవేట్ కాలేజీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి 10,500 కోట్ల బకాయిల్లో సగం చెల్లించమని యాజమాన్యాలు అడిగినా కూడా ప్రభుత్వం కమిటీలు అంటూ కాలయాపన చేస్తూ పోతుంది అని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. కాగా సగం బకాయిలైన చెల్లించకపోతే కొన్ని లక్షల మంది విద్యార్థులతోపాటు కొన్ని వేల మంది కాలేజీల స్టాప్ బృందం తో నిరసనలు వ్యక్తం చేస్తామని ప్రైవేట్ యాజమాన్య సంఘాలు తెలిపాయి. అయినా కూడా ప్రభుత్వం స్పందించకపోవడంతో పరిస్థితులు ఉదృతంగా మారే అవకాశాలు ఉన్నాయి.
Read also : వికారాబాద్ జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం…ఒకరు మృతి
Read also : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 15 న లోక్ అదాలత్





