ఆంధ్ర ప్రదేశ్

బాలయ్య… మజాకా!.. నిమ్మల రామానాయుడుకి జలక్ ఇచ్చిన బాలకృష్ణ?

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- నందమూరి తారక రామారావు తనయుడు నందమూరి బాలకృష్ణ అంటే తెలుగుదేశం పార్టీలో ఒక ప్రత్యేక గౌరవం అనేది ఉంటుంది. అంతేకాకుండా నందమూరి బాలకృష్ణ కూడా ఒకవైపు సినిమా పరంగాను మరోవైపు రాజకీయపరంగానూ ప్రజలను అలరిస్తూ, ప్రజలకు సేవలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. నందమూరి బాలకృష్ణ విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలకు ప్రత్యేక గౌరవం ఉంటుంది. ఎమ్మెల్యేలతో పాటుగా పలుమంది ప్రముఖులు కూడా వాళ్ల ఇళ్లలో ఏమైనా శుభకార్యాలు జరిగితే బాలకృష్ణను ఆహ్వానిస్తూ ఉంటారు. సినిమా పరంగా బిజీ షెడ్యూల్ ఉంటే మాత్రం బాలకృష్ణ ఒక్కొక్కసారి కార్యక్రమాలకు హాజరవ్వరు. కచ్చితంగా వెళ్లాలి అని అనుకుంటే మాత్రం ఏ పరిస్థితుల్లో ఉన్న బాలకృష్ణ లెక్క చేయకుండా పెళ్లిళ్లకు లేదా ఫంక్షన్లకు హాజరవుతూ ఉంటారు.

Read also : జూబ్లీహిల్స్‌ బైపోల్‌పై కవిత ఫోకస్‌ – జాగృతి పేరుతో పోటీ చేసే ఛాన్స్‌

తాజాగా మంత్రి నిమ్మల రామానాయుడు తన కుమార్తె వివాహానికి నందమూరి బాలకృష్ణను ఆహ్వానించారు. దీనికి బాలకృష్ణ చాలా భిన్నంగా నిమ్మల రామానాయుడు కి సమాధానం ఇచ్చారు. ఈ పెళ్లికి కచ్చితంగా వస్తాను.. కానీ ఎలా వస్తా అనేది తెలియదని నిమ్మల రామానాయుడు ముఖం మీదనే సరదాగా అనేశారు. ఏది ఏమైనా బాలకృష్ణ మాత్రం పెళ్లికి తప్పకుండా వస్తానని ఫుల్ గా క్లారిటీ ఇచ్చారు. బాలకృష్ణ ఎక్కడికి వెళ్ళినా కూడా తన ఆటిట్యూడ్ తనతో పాటు వైఫై లా ఉంటుంది. పక్కన ఎవరున్నారు అనేది మాత్రం అసలు పట్టించుకోరు. పక్కనే ఎమ్మెల్యే ఉన్న లేదా నేరుగా సీఎం ఉన్న మాత్రం తనకి ఏం సంబంధం లేదన్నట్టుగా బాలకృష్ణ తన పని తను చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో బాలకృష్ణ చేసేటటువంటి విచిత్రమైన పనులకు చాలా మంది బాలకృష్ణ అభిమానులు సంబరపడిపోతూ ఉంటారు. కేవలం అభిమానులు మాత్రమే కాదు… వారు ఎంతటి వారైనా కూడా బాలకృష్ణ చేసే పనులను సమర్థిస్తూ ఉంటారు. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీలో నిమ్మల రామానాయుడుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఒక మంత్రి అయినా కూడా సామాన్య మనిషిగా చాలా సింపుల్ గా ఉంటారు రామానాయుడు. బహుశా అందుకే నేమో తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి అతను అంటే చాలా ఇష్టం అలాగే గౌరవం. నిమ్మల రామానాయుడు కూతురు పెళ్లికి సీఎం చంద్రబాబు నాయుడుతో అటుగా చాలామంది సెలబ్రిటీలు అలాగే ప్రముఖ రాజకీయవేత్తలు వచ్చే అవకాశం ఉంది.

Read also : కేంద్రం సంచలన నిర్ణయం.. 4 నుంచి 2కు జీఎస్టీ స్లాబ్ ల కుదింపు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button