
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- ఆస్ట్రేలియన్ క్రికెట్ జట్టులోని ఫాస్ట్ బౌలర్ అయినటువంటి కేన్ రిచర్డసన్ తాజాగా క్రికెట్కు గుడ్ బై చెప్పారు. కేన్ రీఛర్డ్ సన్ ఆస్ట్రేలియా జుట్టుకు ఫాస్ట్ బౌలర్ గా ఎన్నో మ్యాచ్లలో విజయానికి తోడ్పడ్డారు. అలాంటి స్టార్ బౌలర్ 34 సంవత్సరాలకే క్రికెట్కు వీడ్కోలు పలికారు. ఈ బౌలర్ ఆస్ట్రేలియా జట్టు తరఫున 25 వన్డేలు అలాగే 36 t20 మ్యాచ్ లు ఆడారు. మరోవైపు బిగ్ బాష్ లీగ్ మరియు ఇండియన్ ప్రీమియర్ లీగ్లలో కూడా వివిధ జట్లకు కీలకపాత్ర పోషించారు. ఆస్ట్రేలియన్ బిగ్ బాస్ లీగ్ లో అన్ని సీజన్లో ఆడినటువంటి అతి కొద్ది మందిలో ఈ స్టార్ బౌలర్ రిచర్డ్ సన్ ఒకరు. మొత్తంగా BBL లో 142 వికెట్లు తీశారు. మరోవైపు ఐపీఎల్ లోనే కాకుండా పలు లీగ్ లలో ఆడి తనదైన ముద్రను వేసుకున్నారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మరియు పూణే జట్లు తరుపున ఈ ఆస్ట్రేలియన్ స్టార్ ఫాస్టు బౌలర్ పలు మ్యాచులు ఆడి తనదైన ముద్రను వేసుకున్నారు.
Read also : కలెక్టర్ ద్వారా ప్రశంసా పత్రం పొందిన మేడి బాల నర్సయ్యని సన్మానించీన బిజెపి మండల నాయకులు
Read also : India-EU Trade Deal: ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’.. భారత్-ఈయూ మధ్య ఏకంగా 13 కీలక ఒప్పందాలు!





