క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణలోని హైదరాబాదులో దారుణం చోటుచేసుకుంది. ముగ్గురు రౌడీషీటర్స్ బాలికపై అత్యాచారం చేసినట్లుగా సమాచారం. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికకు గంజాయి తాగించి మత్తులో ఉన్నప్పుడు ఆ ముగ్గురు రౌడీషీటర్స్ రేప్ చేసినట్లుగా సమాచారం. ప్రస్తుతం ఆ బాలిక పరిస్థితి విషమంగా ఉంది అని.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ బాలికపై ఇంతటి దారుణానికి పాల్పడినటువంటి ఆ ముగ్గురు రౌడీషీటర్స్ పరారీలో ఉన్నట్లుగా సమాచారం. మరిన్ని వివరాలు త్వరలోనే మీ ముందుకు తీసుకువస్తాం..
