Tuesday, February 24, 2026
Homeఆంధ్ర ప్రదేశ్ప్రారంభమైన అసెంబ్లీ.. కల్తీ విషయం తేలిపోనుందా?

ప్రారంభమైన అసెంబ్లీ.. కల్తీ విషయం తేలిపోనుందా?

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం అనేది ఎంతటి రాజకీయ విధ్వంసాన్ని సృష్టించింది అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే సాక్షాత్తు ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం విషయంలో అధికార మరియు ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విస్తృత స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీదంటే మీదే తప్పు అంటూ ప్రతిరోజు ఈ సున్నితమైన విషయాన్ని సాగదీస్తూ పోతున్నారు. ఈ తరుణంలోనే నేడు తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో కీలక చర్చలు జరపనుంది. ఈరోజు 10:30 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ మరియు జనసేన పార్టీకి చెందినటువంటి ఒక పదిమంది సభ్యులు ఈ అంశంపై నిజ నిజాలు మాట్లాడనున్నారు. ఇక కొన్ని అనారోగ్య కారణాల ద్వారా నిన్న సభకు హాజరు కానటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు సభలో ఈ కల్తీ నెయ్యి వ్యవహారంపై కూడా చర్చించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కూటమి నాయకులు మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 12:30 గంటల నుంచి చివరిలో ఈ విషయంపై ఒక ప్రకటన విడుదల చేస్తారు అని ఇప్పటికే అధికారులు పేర్కొన్నారు. దీంతో ఈ తిరుమల తిరుపతి లడ్డు విషయం ఈ రోజైనా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందా అనేది ఆసక్తికరంగా మారింది.

మూసీ నది ఒడ్డున గాంధీ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకించిన మునిమనవడు

Exam Stress Horror: ఎగ్జామ్ కు ప్రిపేర్ కావాలన్న తండ్రి, కాల్చి చంపిన కొడుకు!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments