
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- ఐపీఎల్ లో ముంబై జట్టు తరపున తన సత్తా ఏంటో నిరూపించుకొని నేడు టీమిండియాలో చోటు సంపాదించుకున్నటువంటి యంగ్ క్రికెటర్, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ గతంలో జరిగిన ఒక బాధాకరమైన విషయం చెప్పుకొచ్చారు. 2022వ సంవత్సరం లో బంగ్లాదేశ్ తో మ్యాచ్ ఆడుతున్న సందర్భంగా భారత A జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న. బ్యాటింగ్ కు దిగిన సమయంలో కళ్ళు చమ్మగా మారడంతో పాటు బ్యాట్ ఎత్తడానికి కూడా శక్తి సరిపోవడం లేదు అని, కండరాల నొప్పితో వెంటనే రిటైర్ హర్ట్ వెనక్కి వచ్చేసానని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో నా గురించి తెలుసుకున్న ఆకాశ్ అంబానీ వెంటనే ఫోన్ చేసి బీసీసీఐ పెద్దలతో మాట్లాడి… నా పరిస్థితి గురించి తెలుసుకొని చాలా సహాయం చేశారని చెప్పుకొచ్చారు.
Read also : భారీ వర్షాలపై దుబాయ్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం!
ఆ సమయంలో ఆస్పత్రులో చేరిన నన్ను వైద్యులు తీవ్రంగా హెచ్చరించారు. ఒకవేళ కొంచెం ఆలస్యంగా వచ్చి ఉంటే పరిస్థితి చేయి జారిపోయేది అని వైద్యులు తెలిపారని అన్నారు. అలాంటి పరిస్థితులలో బతికి బయటపడితే చాలు అనుకున్నాను అని జరిగినటువంటి బాధాకరమైన ఒక చేదు విషయాన్ని పంచుకున్నాడు. కండరాల నొప్పి ఉందని తెలిసినా కూడా వరుసగా మ్యాచ్లు ఆడడంతో పరిస్థితి విషమించింది అని.. చివరికి ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. 22 ఏళ్ల తిలక్ వర్మ.. నేడు టీమ్ ఇండియా తరఫున సత్తా చాటుతూ .. తాజాగా జరిగినటువంటి ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై ఒంటరి పోరాటం చేసి, భారత్ కు విజయాన్ని అందించి హీరో అయ్యాడు.
Read also : మహిళల ప్రపంచ కప్ లో రికార్డులు సృష్టించిన మహిళలు.. ఓపినర్స్ ఇద్దరూ సెంచరీలే!





