క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, మాదాపూర్ హైదరాబాద్ 24 నుండి 26 జనవరి 2026 వరకు 40 మంది కళాకారులతో ‘హైదరాబాద్ పెరల్స్ -I (హైదరాబాద్ ముత్యాలు – I) ‘ పేరుతో ఆర్ట్ క్యాంప్‌ను నిర్వహిస్తోంది. ఈ కళా శిబిరాన్ని హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అధ్యక్షుడు మరియు ఆర్ట్ క్యాంపు క్యూరేటర్ అయిన ప్రముఖ శిల్పి M. V. రమణా రెడ్డి ప్రారంభించారు.

సభికులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నగరం కళాకారులను, కళాభిమానులను ఎంతో ఆకర్షిస్తుందని, ఇంకా ఎన్నో కళా కార్యక్రమాలు, కల శిబిరాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని అన్నారు. స్టేట్ ఆర్ట్ గ్యాలరీ వివిధ కళా కార్యక్రమాల నిర్వహణ ద్వారా కళాకారులకు వేదిక కల్పిస్తుందని అభినందించారు. డాక్టర్ కే. లక్ష్మి ఐఏఎస్, డైరెక్టర్ స్టేట్ ఆర్ట్ గేలరీ, ఆర్ట్ క్యాంపు సందర్శించి కళాకారులను కొనియాడారు.
సీనియర్ కళాకారులు డి.అనంతయ్య, ఎస్.కాంతారెడ్డి, ముప్పిడి విట్టల్, కప్పరి కిషన్, అన్నారపు నరేందర్, అప్పం రాఘవ, శ్రీకాంత్ బాబు తదితరుల కళాకారులూ పాల్గొన్నారు. ఈ ఆర్ట్ క్యాంపు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటలవరకు నడుస్తుంది. ఈ కళా శిబిరంలో వేసిన పెయింటింగ్ లు 27 జనవరి 2026 నాడు ఎక్సిబిషన్ నిర్వహిస్తారు.





