మెదక్, క్రైమ్ మిర్రర్: వివాహేతర సంబంధం, కుటుంబ కలహాల నేపథ్యంలో సెలవులపై ఇంటికి వచ్చిన ఆర్మీజవాన్ దారుణ హత్యకు గురికావడం ఆ ప్రాంతంలో కలకలం రేపుతోంది. సెలవులపై ఇంటికి వచ్చిన సుబేదార్‌ను భార్య, ఆ మె కుటుంబ సభ్యులు కర్రలత తీవ్రంగా దాడి చేసి హత్యచేసినట్లు పలీసులు పేర్కొంటున్నారు. పోలీసుల వివరాల ప్రకారం మెదక్ మండలం ర్యాలమడుగు గ్రామానికి చెందిన కుమార్ గౌడ్ (49) భారత సైన్యంలో సుబేదార్‌గా ఉత్తరాఖండ్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయన భార్య పద్మ, ఇద్దరు కుమార్తెలతో కలిసి మెదక్ పట్టణంలోని మిలిటరీ కాలనీలో నివాసం ఉంటోంది.
గత నెల 11వ తేదీన సెలవులపై ఇంటికి వచ్చిన కుమార్ గౌడ్, ఈ నెల 10వ తేదీన తిరిగి విధుల్లో చేరాల్సి ఉంది. అయితే కొంతకాలంగా కుమార్ గౌడ్‌కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందనే ఆరోపణలపై దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ విషయమై కుటుంబ పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా జరిగినట్లు సమాచారం. అప్పట్లో వివాదం సద్దుమణిగినప్పటికీ, మళ్లీ ఇటీవల ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో పద్మ తన పుట్టినిల్లు అయిన కొల్చారం మండలం వరిగుంత గ్రామానికి వెళ్లి అక్కడే ఉంటోంది.