
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- ఈ మధ్యకాలంలో తెలియని వ్యక్తుల నుంచి వచ్చే వీడియో కాల్స్ వల్ల ఎంతోమంది బ్లాక్ మెయిల్ కు గురవుతున్నారు. అంతేకాకుండా ఈ బ్లాక్ మెయిల్ ద్వారా ఎంతో డబ్బును పోగొట్టుకుంటున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పటివరకు ఎంతోమంది ఈ బ్లాక్ మెయిల్ కారణంగా ప్రాణాలు కూడా తీసుకున్న సంఘటనలు చూశాం. సైబర్ నేరగాళ్లు ఈ రోజుల్లో ఏ ఒక్క అవకాశం కూడా వదులుకోవట్లేదు. పేద ప్రజల నుంచి ఏకంగా రాజకీయ నాయకులను కూడా మోసం చేసేంతవరకు ఎదిగిపోయారు. ఇక తాజాగా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే వీడియో కాల్స్ వల్ల ఎంతోమంది మోసపోతున్నారు.. కాబట్టి వీరి పట్ల కాస్త జాగ్రత్త వహించాలి అని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Read also : గుండెపోటుతో కారోబార్ రాజమౌళి మృతి
తాజాగా ఇలానే ఒక వ్యక్తి తనకు తెలియని ఒక నెంబర్ నుంచి కాల్ రావడం ఆ కాల్ లో మహిళా తనతో మంచిగా మాట్లాడి చివరికి నీ బాగోకులు బయటపెట్టేస్తాను అని బ్లాక్ మెయిల్ కు గురిచేసి దగ్గర దగ్గరగా నాలుగు లక్షల రూపాయలను గుంజుకుంది. ఆ గుర్తు తెలియని మహిళ వీడియో కాల్ చేయడమే కాకుండా అతడిని షెడ్యూస్ చేయగా అది వైరల్ చేస్తామంటూ మరో వ్యక్తి అతన్ని బెదిరించి పలుమార్లు డబ్బులు వసూలు చేశాడట. అంతేకాకుండా తన బ్యాంకు ఎకౌంట్స్ ని కూడా హ్యాక్ చేసి మరిన్ని డబ్బులను డిమాండ్ చేయడంతో వెంటనే ఆ బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఎవరైనా సరే ఈ రోజుల్లో మోసపోవడం చాలా సులువుగా మారిపోయిందని.. ఒకవేళ ఇలాంటి మోసాలకు గురవుతాయి వెంటనే పోలీసులను సంప్రదించాలని.. పోలీసులు సూచించారు.
Read also : ఎలుగుబంటి అవతారం ఎత్తిన నూతన సర్పంచ్.. గ్రామం కోసం దేనికైనా సిద్ధం!





