జాతీయంవైరల్

అన్వేష్ అనుచిత వ్యాఖ్యలు.. దేశద్రోహిగా ప్రకటించాలన్న హిందూ సంఘాలు?

క్రైమ్ మిర్రర్,జాతీయ న్యూస్ :-
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి నా అన్వేషణ అనే యూట్యూబర్ అన్వేష్ కు వరుసగా షాక్ తగులుతూ వస్తుంది. హిందూ దేవుళ్లను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అన్వేష్ పై హిందూ సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. హిందూ దేవుళ్లను దూషించడమే కాకుండా కొంతమందికి వక్తాసుపలకడంతో భారత్ లో ఉన్న ప్రతి ఒక్క హిందువు అతనిపై ఆగ్రహంగా ఉన్నారు. ఈ సందర్భంలోనే చాలామంది కూడా అతన్ని భారతదేశానికి రప్పించి కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా దేశద్రోహిగా ప్రకటించాలి అని తాజాగా హిందూ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉండడంతో ఈ విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. నిన్న మొన్నటి వరకు ఇన్స్టాగ్రామ్ లో అతనికి 18 లక్షల మంది ఫాలోవర్లు ఉండగా కేవలం రెండు మూడు రోజుల్లోనే కొన్ని లక్షల మంది అను ఫాలో చేశారు. ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ వరుసగా అన్వేశ్ పై కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి.

Read also : నూతన సంవత్సర వేల గోవిందా అనే నామస్మరణతో మారుమోగిన తిరుమల క్షేత్రం

చాగంటి కోటేశ్వరరావు పై అలాగే హిందూ దేవుళ్ళపై అన్వేష్ మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరిని కూడా ఆగ్రహానికి గురి చేశాయి. అతను ఇండియాకి వస్తే ఖచ్చితంగా చంపివేస్తాము అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా ఎంతోమంది కామెంట్లు చేస్తూ మండిపడుతున్నారు. తాజాగా సినీనటి, బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి కూడా అన్వేష్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అతనికి త్వరగా నోటీసులు జారీ చేస్తాము అని పోలీసులు కూడా తెలిపారుట. దీంతో అన్వేష్ కు బిగ్ షాక్ తగలనుంది. ఇప్పటికే అన్వేష్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా క్షమాపణలు చెప్పిన కూడా అందులో నాది ఏమీ తప్పులేదు అని కేవలం మీకు వివరించడానికి అలా చేయాల్సి వచ్చింది అని సమాధానం చెబుతున్నా కూడా దానికి హిందూ సంఘాలు ఒప్పుకోవడం లేదు. హిందూ దేవుళ్ళపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల కొద్ది రోజుల్లోనే కొన్ని లక్షల మంది ఫాలోవర్లను కోల్పోయాడు. హిందువైన ప్రతి ఒక్కడు కూడా అతనిని అన్ఫాలో చేయాలి అని సోషల్ మీడియా వేదికగా అందరూ పోస్టులు కూడా చేస్తున్నారు. ఈ తరుణంలోనే రానున్న రోజుల్లో అతని పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఎవరికి కూడా అర్థం కాకుండా ఉంది.

Read also : గొప్పలు, సోకుల కోసమే ఈ జనరేషన్ జీవిస్తుంది.. యువత మేలుకో?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button