
క్రైమ్ మిర్రర్, ఎంటర్‌టైన్‌మెంట్: రెండు దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ, టాలీవుడ్‌లో లేడీ పవర్‌గా గుర్తింపు పొందిన కన్నడ బ్యూటీ అనుష్క శెట్టి. ‘అరుంధతి’, ‘భాగమతి’ వంటి చిత్రాలతో లేడీ-ఒరియెంటెడ్ కథలకు కేర్‌ఫుల్ అడ్రస్‌గా నిలిచింది. ‘బాహుబలి’ సిరీస్‌తో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించి, తన ప్రతిభకు సాటి లేనట్టు నిరూపించింది.
‘సైజ్ జీరో’, ‘నిశ్శబ్దం’, ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ వంటి విభిన్న పాత్రలను ఎంచుకుని రకరకాల కథల్లో నటించడం ద్వారా ఈతరం హీరోయిన్లకు ఆదర్శంగా మారింది. ఇటీవలే 44వ పుట్టినరోజు జరుపుకున్న అనుష్క, తన ఫిట్నెస్ సీక్రెట్స్‌ను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచారు.
యోగా ద్వారా ఆరోగ్యం
అనుష్క ఒక యోగా బోధకురాలిగా మారిన విషయం, తన జీవితంలో అతి ముఖ్యమైన నిర్ణయం అని పేర్కొన్నారు. ఆమె కొన్ని యోగాసనాలను వీడియోలో చూపిస్తూ, వాటిని అభిమానులతో పంచుకున్నారు.
అనుష్క ప్రియమైన ఆసనాలు
సూర్యనమస్కారం
12 ఆసనాల సీక్వెన్స్‌గా ఉంటుంది. రోజూ 5-10 సార్లు చేయడం వల్ల పూర్తి శరీరానికి వ్యాయామం జరుగుతుంది. గుండె పనితీరు మెరుగుపడుతుంది. ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. శరీరంలోని కొవ్వు కరుగుతుంది.
చతురంగ దండాసనం
30 సెకన్ల నుంచి 1 నిమిషం పాటు చేస్తే చేతులు, భుజాలు, కాళ్లకు వ్యాయామం అందుతుంది. రక్తప్రసరణ మెరుగుపడుతుంది, కండరాలు దృఢమవుతాయి.
వీరభద్రాసనం
కాళ్లు, తొడల కండరాలకు వ్యాయామం చేస్తుంది. రోజూ 30-45 సెకన్లపాటు చేస్తే మెటబాలిక్ రేటు పెరుగుతుంది, రోజంతా కేలరీలు ఖర్చవుతుంటాయి.
భుజంగాసనం
పొట్ట కండరాలకు వ్యాయామం, జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. వెన్నెముక ఆరోగ్యం కోసం ఉపయోగపడుతుంది.
అధోముఖ శ్వానాసనం
‘V’ ఆకారంలో శరీరాన్ని వంచడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది, ఒత్తిడి తగ్గుతుంది.
నావాసనం
వెన్నెముకకు బలం చేకూరుస్తుంది, కేలరీలు ఖర్చు చేయడంలో సహాయపడుతుంది, ఒత్తిడి తగ్గిస్తుంది.
హలాసనం
థైరాయిడ్ గ్రంథి ఉత్తేజితం అవుతుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది, వెన్నెముకను స్ట్రెచ్ చేస్తుంది.
ఫిట్‌గా, యవ్వనంగా ఉండటానికి క్రమం తప్పకుండా యోగా చేయడం, సమతుల ఆహారం, రోజుకు ఎనిమిది గంటల నిద్రపోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం సాధించవచ్చు. అనుష్క శెట్టి చూపించిన మార్గం అభిమానులకు ఫిట్‌నెస్‌లో ప్రేరణనిస్తుంది.
ALSO READ: Team India U19: టీమిండియాకు ఎంపికైన హైదరాబాద్ కుర్రాడు





