క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2026-27 వార్షిక బడ్జెట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా మరో 2 లక్షల మందికి ‘చేయూత’ పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీ వేదికగా ఈ కీలక ప్రకటన చేశారు.
ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్హులైన సుమారు 2 లక్షల మందిని కొత్త పెన్షన్ల కోసం ఎంపిక చేయనున్నారు. ఈ చేయూత పథకం విస్తరణ మరియు పింఛన్ల పంపిణీ కోసం బడ్జెట్లో ₹14,861 కోట్లు కేటాయించారు.
మే నెలలో అర్హులైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించి, జూన్ 2న తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ కొత్త పింఛన్ల పంపిణీ ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. చాలా కాలంగా కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వృద్ధులు, వితంతువులు మరియు ఇతర అర్హులైన నిరుపేదలకు ఈ నిర్ణయం ద్వారా సామాజిక భద్రత లభించనుంది.
