సినిమా

Anasuya- Shivaji: అనసూయ వర్సెస్ శివాజీ, కొనసాగుతున్న ‘బట్టల’ లొల్లి!

మహిళల దుస్తులపై శివాజీ చేసిన కామెంట్స్ పై దుమారం కొనసాగుతోంది. శివాజీ సారీ చెప్పినప్పటికీ, అనసూయ మాత్రం తగ్గేది లేదంటోంది. సోషల్ మీడియాలో లైవ్ పెట్టిమరీ..

స్త్రీల దుస్తుల గురించి నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై నటి అనసూయ తీవ్రంగా రియాక్ట్ అయ్యింది. “త్వరలోనే మీ రుణం తీర్చుకునే అవకాశం నాకు కూడా రావాలని కోరుకుంటున్నా” అని తనని ఉద్దేశిస్తూ ఆయన చేసిన కామెంట్స్ పై తాజా వ్యాఖ్యలపై  ఘాటుగా స్పందించింది. ‘‘చాలా సందర్భాల్లో చాలా దాటుకుని వచ్చాను. మీ సపోర్ట్‌ నాకు అక్కర్లేదు. నన్ను నేను ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు’’ అన్నది.

హీరోయిన్ల దుస్తులపై శివాజీ వ్యాఖ్యల దుమారం

హీరోయిన్‌ల దుస్తులపై శివాజీ వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపింది. దీనిపై సామాజిక మాధ్యమాల వేదికగా కామెంట్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో బుధవారం శివాజీ ప్రెస్‌మీట్‌ పెట్టి, తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తూ, తాను నటి అనసూయను ఏమీ అనలేదని ఆమె అనవసరంగా ఇందులోకి వచ్చారని అన్నారు. దీనిపై అనసూయ స్పందించింది. సోషల్‌మీడియాలో లైవ్ పెట్టి మరీ సీరియస్ అయ్యింది. ‘‘ఇటీవల నేను షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు వెళ్లాను. అక్కడ మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చాను. ఆయనకు అనిపించింది చెప్పినప్పుడు నాకు అనిపించింది నేను చెప్పా. ఈరోజు ఒక్కరే కూర్చొని. బాధితుడిగా నటిస్తున్నారు. దీన్నే అతి తెలివి అంటారు. ఒక్క మాటలతో చెప్పాలంటే, చేతగానితనంతో మాట్లాడుతున్నారు. అదేమంటే ఫేక్‌ ఫెమినిస్ట్‌ లని మాపై ముద్రవేస్తారు”.

“ఈ కాలంలో కూడా దుస్తుల గురించి మాట్లాడటం చేతగానితనం. స్వీయ నియంత్రణ లేని వాళ్లు, అభద్రతాభావంతో బతికే వాళ్లు మాత్రమే ఎదుటి వాళ్లపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తారు. ఈ రోజు సానుభూతి పోగు చేసుకుని ఒక్కరే మీడియా ముందు కూర్చొన్నారు. పాపం ఆయనకు అదే కావాలి.  హీరోయిన్లు మంచిగా దుస్తులు వేసుకోవాలని ఆయన చెబుతున్నారు. మీరు ఏం వేసుకోవాలో నేను చెబుతున్నానా? మేము చిన్నపిల్లలం కాదు. మా హక్కులు మాకు తెలుసు. మా ఇష్టానికి మమ్మల్ని బతకనీయండి” అని తీవ్రంగా వ్యాఖ్యానించింది.

అదే విషయాన్ని మగాళ్లకు చెప్పండి!

హీరోయిన్స్‌ ఇబ్బంది పడుతున్నారని మీరు భావిస్తే, ‘ఒరేయ్‌ జంతువుల్లా అలా మీద పడటం ఏంటి? మహిళలను గౌరవించండి’ అని అక్కడకు వచ్చే యువకులకు చెప్పండి. దుస్తులు ఎలా వేసుకోవాలో ఎక్కడైనా రాసి ఉందా? శివాజీగారు మర్యాదగా చెబుతున్నా,  నన్ను బాగా చూసుకునే భర్త, స్నేహితులు ఉన్నారు. మీలాంటి వాళ్ల సాయం అస్సలు అక్కర్లేదు.   మరోవైపు నటి నిధి అగర్వాల్‌ కూడా ఇన్‌స్టా వేదికగా పోస్ట్‌ పెట్టారు. ‘బాధితులపై తప్పు నెట్టడాన్నే అతి తెలివి అంటారు’ అంటూ పోస్ట్‌ పెట్టారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button