Saturday, February 21, 2026
Homeఆంధ్ర ప్రదేశ్బయటకొచ్చిన వెంటనే జగన్ ను కలిసిన అంబటి రాంబాబు

బయటకొచ్చిన వెంటనే జగన్ ను కలిసిన అంబటి రాంబాబు

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- రెండు రోజుల క్రితం అంబటి రాంబాబు జైలు నుంచి విడుదలైన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే.అయితే ఈ నేపథ్యంలోనే నిన్నటి రోజున వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డితో అంబటి రాంబాబు భేటీ అయ్యారు. జైలు నుంచి బెయిల్ మీద విడుదలైన అంబటి రాంబాబు వెంటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి జరిగిన ఘటనల విషయాలపై చర్చించారు. ఈ నేపథ్యంలోనే వైయస్ జగన్ తన పార్టీ నాయకుడైనటువంటి అంబటి రాంబాబుకు ధైర్యం చెప్పి.. ఈ ప్రజా పోరాటాన్ని ఇంతటితో ఆపవద్దు అని సూచించారు. కావాలని వైసిపి పార్టీ నేతలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలలో భాగంగా కేసులు పెడుతుంది అని.. వాటిని న్యాయపరంగానే ఎదుర్కొందామని జగన్మోహన్ రెడ్డి తెలిపారు. అలాగే అంబటి రాంబాబు విషయంలో చాలా మంది పోలీసులు కూడా చట్టాన్ని పక్కనపెట్టి మరీ వ్యవహరించారు అని.. ఇప్పటికైనా పోలీసులు తమ పనితీరును మార్చుకోవాలి అని జగన్మోహన్ రెడ్డి తెలిపినట్లు సమాచారం. ఏది ఏమైనా కూడా అంబటి రాంబాబు అరెస్ట్ అలాగే తిరుమలలో లడ్డు కల్తీ విషయంపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజు కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈ అంశాలపై ప్రతి ఒక్కరు కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతుండడం.. ప్రజలను కూడా వకింత కలవరపెడుతుంది. రాజకీయ నాయకులు ఒక విషయాన్ని పదేపదే ప్రతిరోజు చర్చిస్తుండడం అనేది ప్రతి ఒక్కరిని కూడా ఆగ్రహానికి గురిచేస్తుంది. ఇప్పటికైనా రాజకీయ నాయకులు సున్నితమైన విషయాలను పక్కనపెట్టి ప్రజలకు పనికొచ్చే పనులను చేయవలసిందిగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఇంగ్లాండ్ బ్యాటర్ సిక్సర్.. స్టేడియంలోని మహిళకి గాయం!

విడుదలకు ముందే హిట్.. లాభాల బాటలో ‘విష్ణు విన్యాసం’

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments