టాలీవుడ్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. హీరో అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన నేపథ్యంలో పోలీసులు అల్లు అర్జుణ్ ను అరెస్టు చేశారు. ఇందులో భాగంగానే టాస్క్ ఫోర్స్ పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్టు చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పుష్ప-2 ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం మనందరికీ తెలిసిందే.
ట్రోల్లర్స్ కి ఇచ్చి పడేసిన సాయి పల్లవి!
ఇందులో భాగంగానే ఆమె కుమారుడు కూడా తీవ్రంగా గాయపడడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇక తాజాగా ఇవాళ ఈ కేసులోనే అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఘటన జరిగిన రెండవ రోజు అల్లు అర్జున్ మృతి చెందిన కుటుంబానికి 25 లక్షలు పరిహారం చెల్లిస్తామన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ కేసులో పోలీసులు ప్రస్తుతానికి అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు.
గోవాలో ఘనంగా నటి కీర్తి సురేష్ పెళ్లి
కాగా పుష్ప -2 సినిమా అనేది ప్రస్తుతానికి దేశం మొత్తం మీద 1000 కోట్ల పైగానే వసూలు రాబట్టింది. అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా సరికొత్త రికార్డులు సృష్టించుతుండగా అంతలోనే అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరి ఇన్ని సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న వేళ అల్లు అర్జునుని పోలీసులు అరెస్ట్ చేయడం ఏ విధంగా ప్రభావితం చూపిస్తుందో వేచి చూడాల్సిందే.
బ్రేకింగ్ న్యూస్!.. మాజీ మంత్రులు సబితా, సత్యవతి రాథోడ్ అరెస్ట్?