Homeక్రైమ్క్రెడిట్ కార్డుల స్కామ్ పట్ల తస్మాత్ జాగ్రత్త : SP శరత్ చంద్ర

క్రెడిట్ కార్డుల స్కామ్ పట్ల తస్మాత్ జాగ్రత్త : SP శరత్ చంద్ర

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్:-క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్ ద్వారా లేదా SMS వస్తున్నట్లయితే, అది సైబర్ మోసగాళ్ళ పని అయ్యి ఉంటుందని..వారి పట్ల జాగ్రత్త గా ఉండాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఒక ప్రకటనలో తెలిపారు. క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచే ఆఫర్‌తో సైబర్ మోసగాళ్ళు బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి మిమ్మలను నమ్మించి CVV, OTP మరియు ఇతర వివరాల వంటివి తెలుసుకొని క్రెడిట్ కార్డ్ హోల్డర్ యొక్క సున్నితమైన డేటాను పొంది మీ క్రెడిట్ కార్డు లో ఉన్న లిమిట్ ను ఖాళీ చేస్తారని అన్నారు.

అటువంటి కాల్స్ వస్తే నమ్మకండి, ముఖ్యంగా మీ CARD, CVV నంబరు OTP వంటి వివరాలను ఎవ్వరికీ చెప్పవద్దని తెలిపారు. ఏలాంటి సంఘటనలు జరిగిన వెంటనే సైబర్ క్రైమ్ ని www.cybercrime.gov.in నందు లేదా 1930 టోల్ ఫ్రీ నంబరు కు కాల్ చేసి రిపోర్ట్ చేయగలరు.

ఇవి కూడా చదవండి

  1. ఐదేళ్ల చిన్నారిపై యువకుడి అత్యాచారం – పసిపాప ప్రైవేట్‌ భాగాలపై 28 కుట్లు

  2. ఏపీలో పింఛన్ల పంపిణీ – స్వల్ప మార్పులు చేసిన ప్రభుత్వం

  3. మూడు లక్షల కోట్లు దాటిన బడ్జెట్… పవన్ శాఖలకు భారీ నిధులు?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు