
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరు పొందినటువంటి మేడారం సమ్మక్క- సారక్క మహా జాతరకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమయ్యింది. దాదాపు 150 కోట్లకు పైగా రూపాయలను ఈ జాతరకు ప్రభుత్వం మంజూరు చేయగా అధికారులు అన్ని ఏర్పాట్లకు సిద్ధం చేసుకుంటున్నారు. వచ్చే ఏడాది జనవరి 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు దాదాపు నాలుగు రోజులపాటు ఈ మేడారం జాతర ఘనంగా జరగనుంది. కాబట్టి ఇప్పటికే ఈ జాతర కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తుంది. మేడారం జాతర జరిగే ప్రదేశాన్ని ఎనిమిది జోన్లుగా, 31 సెక్టార్లుగా విభజిస్తున్నట్లుగా అధికారులు తాజాగా వెల్లడించారు. ఏకంగా 1050 ఎకరాల్లో 49 పార్కింగ్ స్థలాలు, జాతరకి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా 24 శాశ్వత, 20 తాత్కాలిక మొబైల్ టవర్లు ద్వారా నిరంతరం విద్యుత్ సరఫరా అందిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు.
Read also : భారీ వర్షాలు.. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు : మంత్రి అనిత
మేడారం జాతరకు కొన్ని లక్షల మంది జనం వస్తుండగా… జాతరలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా దాదాపు 12,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. పెద్ద ఎత్తున భక్తులు రాకతో… దొంగతనాలు, దోపిడీలు, తొక్కిసలాటలు జరగకుండా పోలీసులు భక్తులకు మైక్ సెట్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలను తెలియజేస్తామని తెలిపారు. ఈ మేడారం జాతరకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రమే కాకుండా దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం… మేడారం సమ్మక్క సారక్క జాతరలకు భారీ భద్రతను ఏర్పాటు చేసింది.
Read also : మత్స్యకారులను వెనక్కి తీసుకువచ్చే బాధ్యత మాది : మంత్రి అచ్చెన్నాయుడు