తెలంగాణవైరల్

Good News: ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్కొక్కరికి ₹1.02 కోట్ల రూపాయాలు

క్రైమ్ మిర్రర్ తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఊరటనిస్తూ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.ప్రమాదవశాత్తు మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యం సంభవించినా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 5.14 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ప్రయోజనం చేకూరనుంది.
ప్రతి ఉద్యోగికి ₹1.02 కోట్ల ప్రమాద బీమా (Accidental Insurance) వర్తిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగుల వేతన ఖాతాలు ఉన్న బ్యాంకుల ద్వారా ఈ బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ప్రధానంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ బీమా సౌకర్యానికి ఉద్యోగులు ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు (Zero Premium). బ్యాంకులు తమ కార్పొరేట్ శాలరీ ప్యాకేజీలో భాగంగా దీనిని అందిస్తున్నాయి. ప్రమాదవశాత్తు మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యం సంభవించినా ఈ బీమా వర్తిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button