Monday, February 16, 2026
Homeక్రీడలురోహిత్ శర్మ తోవలోకే అభిషేక్ శర్మ.. ఫ్యాన్స్ అభిప్రాయాలు ఇవే?

రోహిత్ శర్మ తోవలోకే అభిషేక్ శర్మ.. ఫ్యాన్స్ అభిప్రాయాలు ఇవే?

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- టి20 వరల్డ్ కప్ లో భాగంగా భారత్ వరుస విజయాలతో దూసుకుపోతున్న.. ఒక్క విషయంలో మాత్రం ప్రతి ఒక్కరిని కలవరపెడుతుంది. ఓపెనరుగా అభిషేక్ శర్మ ఎంతటి విధ్వంసకర ప్లేయర్ అనేది మనందరికీ తెలుసు. కానీ అభిషేక్ శర్మ ఆడిన చివరి ఆరు మ్యాచ్లలో ఏకంగా నాలుగు సార్లు డక్ ఔట్ అయ్యారు. తన టాలెంట్ పై ఎటువంటి సందేహం లేకపోయినా నిలకడలేని ఫామ్ తో ప్రతి ఒక్కరు కూడా దిగులు చెందుతున్నారు. ఒకప్పుడు రోహిత్ శర్మ ఒక మ్యాచ్ లో విధ్వంసకరంగా ఆడితే రెండో మ్యాచ్లో డక్ ఔట్ అయిన సందర్భాలు చాలా చూశాం. టి20 ఫార్మాట్లో భారత ఓపినర్లుగా రోహిత్ శర్మ ఏకంగా 10 సార్లు డక్ ఔట్ అయ్యారు ఇక ఆ తరువాత అభిషేక్ శర్మ అలాగే కేఎల్ రాహుల్ 5సార్లు డకోట్ అయ్యారు. దీంతో అభిషేక్ శర్మ రోహిత్ తోవలోకే వెళ్తున్నట్లుగా ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. కానీ రోహిత్ శర్మ తన కెప్టెన్సీ ఒత్తిడిలో జట్టు పరుగుల బోర్డును ముందుకు తీసుకువెళ్లడంలో అవుట్ అవుతున్నారు అని అతనికి చాలా మంది సపోర్ట్ గా నిలిచారు. ఇక అభిషేక్ శర్మ సైతం జట్టుకు ఎక్కువ పరుగులు అందించాలనే ఆలోచనతోనే వెంటనే అవుట్ అవుతున్నారు అని.. కానీ ఓపినర్ గా అభిషేక్ శర్మానే నెంబర్ వన్ బ్యాట్స్మెన్ గా ఎప్పటికైనా ఉండాలి అని ఫ్యాన్స్ సైతం కోరుకుంటున్నారు. ఇక నిన్న పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లోను అభిషేక్ శర్మ డక్ ఔట్ అయిన విషయం తెలిసిందే. కానీ అభిషేక్ శర్మ ఓపెనర్ స్థానంలోనే టీ20 లోని ప్రతి మ్యాచ్ లో తప్పకుండా ఆడాలి అని.. అప్పుడే భారత్ ఎక్కువ విజయాలను నమోదు చేయగలదు అని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ఇబ్రహీంపట్నంలో హైటెన్షన్: ఇద్దరు కౌన్సిలర్ల కిడ్నాప్..!

Plane Passengers: ఇకపై అలా చేస్తే విమానం ఎక్కనీయరట, ఆ తప్పు మీరూ చేయకండి!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments