క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: ఏప్రిల్ 1, 2026 నుండి కొత్త పాన్ (PAN) కార్డ్ దరఖాస్తు లేదా అప్‌డేట్ నిబంధనల్లో కీలక మార్పులు రానున్నాయి. ఇప్పటివరకు కేవలం ఆధార్ కార్డ్‌ను ఉపయోగించి సులభంగా పాన్ పొందవచ్చు, కానీ ఈ వెసులుబాటు మార్చి 31, 2026 తో ముగియనుంది. ఏప్రిల్ 1 నుండి పాన్ దరఖాస్తుకు కేవలం ఆధార్ ఒక్కటే సరిపోదు. పుట్టిన తేదీ (DOB) ధృవీకరణ కోసం ఆధార్ కాకుండా ఇతర ప్రభుత్వ గుర్తింపు పత్రాలను సమర్పించడం తప్పనిసరి.
అంగీకరించబడే పత్రాలు…
1. పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం (Birth Certificate)
2. వోటర్ ఐడీ (Voter ID)
3. 10వ తరగతి సర్టిఫికేట్ లేదా మార్కుల మెమో
4. పాస్‌పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్
5. మేజిస్ట్రేట్ జారీ చేసిన అఫిడవిట్
పాన్ దరఖాస్తులో మీ పేరు ఖచ్చితంగా ఆధార్ కార్డ్‌లో ఉన్న విధంగానే ఉండాలి. ఏవైనా తప్పులు ఉంటే ముందే సరిచేసుకోవడం ఉత్తమం. ప్రస్తుతమున్న ఫారమ్ 49A మరియు 49AA స్థానంలో కొత్త ఫారమ్ 93 మరియు 95 వంటివి అందుబాటులోకి రానున్నాయి. అదనపు డాక్యుమెంట్ల శ్రమ లేకుండా, కేవలం ఆధార్‌తో సులభంగా పాన్ పొందాలనుకునే వారు మార్చి 31లోపు దరఖాస్తు చేసుకోవడం మంచిది.
