జాతీయంసినిమా

ఆడవాళ్ల రక్తం రుచి మరిగిన పోలీస్.. ఓటీటీలో ఒళ్లుగగుర్పొడిచే క్రైమ్ థ్రిల్లర్

ఇటీవలి కాలంలో ఓటీటీ ప్రేక్షకుల అభిరుచులు మారుతున్నాయి. ముఖ్యంగా సస్పెన్స్, హారర్, క్రైమ్ థ్రిల్లర్ జానర్ సినిమాలకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది.

ఇటీవలి కాలంలో ఓటీటీ ప్రేక్షకుల అభిరుచులు మారుతున్నాయి. ముఖ్యంగా సస్పెన్స్, హారర్, క్రైమ్ థ్రిల్లర్ జానర్ సినిమాలకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. భాషతో సంబంధం లేకుండా ఈ తరహా సినిమాలను ప్రేక్షకులు ఆసక్తిగా వీక్షిస్తున్నారు. కథలో ఉన్న ఉత్కంఠ, అనూహ్య మలుపులు, భయాన్ని కలిగించే సన్నివేశాలే ఓటీటీ ఆడియెన్స్‌ను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. ఇతర భాషలతో పోల్చితే తెలుగులో ఈ జానర్ సినిమాలు సంఖ్యాపరంగా కొంత తక్కువే అయినా, వచ్చినప్పుడు మాత్రం ప్రేక్షకులను గట్టిగానే థ్రిల్ చేస్తున్నాయి.

అలాంటి సినిమాల్లో కొన్ని నెలల క్రితం విడుదలైన ఓ తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. హాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన జాంబీ ఫ్రాంఛైజీ సినిమాలను తలపించేలా, ఆడవాళ్ల రక్తం తాగే ఓ నరరూప రాక్షసుడి కథతో ఈ సినిమా సాగుతుంది. సినిమా అంతా ఆసక్తికరంగా నడిచినా, ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ మాత్రం ప్రేక్షకులను పూర్తిగా షాక్‌కు గురిచేస్తుంది.

ఈ సినిమా కథ హైదరాబాద్ నేపథ్యంలో సాగుతుంది. నగరంలో వరుసగా కొందరు యువతులు అదృశ్యమవుతుండటం పోలీసులకు కలవరపెడుతుంది. ఈ మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక అధికారులుగా హీరో, హీరోయిన్ రంగంలోకి దిగుతారు. దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలో, ఎప్పుడో అంతరించిపోయిందనుకున్న ఓ పురాతన తెగకు చెందిన వ్యక్తి నగరంలో ఉన్నాడని పోలీసులు గుర్తిస్తారు. అతనే యువతులను అపహరించి వారి రక్తాన్ని తాగుతున్నాడన్న భయానక నిజం వెలుగులోకి వస్తుంది.

ఆడవాళ్ల రక్తం తాగే ఆ మనిషి ఎవరు, అతడి వెనక ఉన్న కథ ఏమిటి, అతని ఉద్దేశం ఏంటి అనే ప్రశ్నలు ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచుతాయి. అదే సమయంలో పోలీసులు అతడిని ఎలా గుర్తించారు, చివరికి అతడిని పట్టుకునేందుకు ఎలాంటి వ్యూహం రచించారు అన్న అంశాలు కథను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి. ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే సినిమా మొత్తాన్ని చూడాల్సిందేనని చెప్పాల్సిందే.

ఆద్యంతం బిగుసుకుపోయే కథనం, ఉత్కంఠభరిత సన్నివేశాలు, ఊహించని ట్విస్టులతో ఈ సినిమా ప్రేక్షకులను థ్రిల్‌కు గురి చేస్తుంది. ఈ మూవీ పేరు హిడింబ. స్టార్ యాంకర్ ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు ఈ సినిమాలో హీరోగా నటించి మెప్పించాడు. కన్నెగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నందితా శ్వేతా హీరోయిన్‌గా కీలక పాత్ర పోషించింది.

థియేటర్లలో ఈ సినిమా మిశ్రమ స్పందన పొందినప్పటికీ, ఓటీటీ విడుదల తర్వాత మాత్రం విపరీతమైన రెస్పాన్స్ దక్కించుకుంది. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ ఎవ్వరూ ఊహించని విధంగా ఉండటంతో మైండ్ బ్లాక్ అయిందంటూ సోషల్ మీడియాలో ప్రేక్షకులు కామెంట్స్ చేశారు. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి హిడింబ ఒక ప్రత్యేక అనుభూతిని అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు.

మీరు ఇంకా ఈ సినిమాను చూడకపోతే, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్ స్టార్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో హిడింబను చూసి థ్రిల్‌ను ఆస్వాదించవచ్చు.

ALSO READ: చలాన్ చెల్లించేందుకు జనాల పరుగులు.. ఎందుకో తెలుసా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button