
క్రైమ్ మిర్రర్ , వేములపల్లి: నల్గొండ జిల్లా వేములపల్లి మండలము ఆమనగల్లు గ్రామంలోనీ శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవస్థానమునకు వెళ్లే రోడ్డు పక్కననే నేను ఉన్నాను. నా పేరు విద్యుత్ పోల్ అంటారు. నేను గత కొంతకాలంగా పక్కకు ఒరిగి పోయాను,నన్ను ఎవరైనా కాపాడుతారని చూస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు అసలే వర్షాకాలం, వర్షానికి భూమి తడిసి నేను భూమిపై పడిపోయే ప్రమాదం ఎక్కువగా ఉన్నది, అదే కనుక జరిగితే అటుగా వెళ్లే భక్తులు కానీ రైతులు గాని ఇంక మూగ జీవాలు నన్ను గమనించక నన్ను తగిలితే ప్రాణ నష్టాలు జరిగే అవకాశం లేకపోలేదు.. నేను ఇంత ప్రమాదకరంగా కనిపిస్తున్నప్పటికీ కూడా నన్ను ఇటు విద్యుత్ అధికారులు గానీ అటు కాంట్రాక్ట్ సిబ్బంది కానీ నన్ను మరచి పోయారు. నావల్ల ఇంత ప్రమాదం ఉన్నప్పటికీ కూడా విద్యుత్ అధికారులు మాత్రం ఇటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు, నా నుండి ప్రజలకు, రైతులకు, ఎంతగా ఉపయోగం ఉంటుందో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐన కూడా ఇంతవరకు నన్ను ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు. సోమవారం ఇటుగా వెళ్తున్న ఓ వ్యక్తి నన్ను గమనించి తన చారవాణిలో చిత్రీకరించి గ్రామానికి సంబంధించిన సోషల్ మీడియా వాట్సప్ గ్రూపులో పెట్టడం జరిగింది. అది చూసిన క్రైమ్ మిర్రర్ ప్రతినిధి అంజి నన్ను నా బాధను చూసినాడు కాబట్టి నాకు మరమత్తులు చెపిస్తాడనే నమ్మకం నాకు కలిగింది. దీంతో ఆ స్తంభాన్ని, ఆ స్తంభం నుండి ప్రజల ప్రాణాలను, మూగజీవుల ప్రాణాలను కాపాడాలని ఆ విలేఖరి ప్రయత్నంగా ఈ వార్తను పొందుపరచడం జరిగింది. ఇప్పటి కైనా విద్యుత్ మరియు కాంట్రాక్టర్లు తక్షణమే స్పందించి నాకు అనగా విద్యుత్ పోల్‌కు మరమత్తులు చేయించి నన్ను యదావిధిగా వుండే విధంగా చేయండి, ప్రజల ప్రాణాలను రక్షించండి అని విద్యుత్ అధికారులను కోరుతున్నాను… చారవాణిలో చిత్రీకరించి గ్రామానికి సంబంధించిన సోషల్ మీడియా వాట్సప్ గ్రూపులో పెట్టడం జరిగింది. అది చూసిన క్రైమ్ మిర్రర్ ప్రతినిధి అంజి వెంటనే నా దగ్గరికి వచ్చి నన్ను నా బాధను చూసినాడు కాబట్టి నాకు మరమత్తులు చెపిస్తాడనే నమ్మకం నాకు కలిగింది. దీంతో ఆ స్తంభాన్ని, ఆ స్తంభం నుండి ప్రజల ప్రాణాలను, మూగజీవుల ప్రాణాలను కాపాడాలని ఆ విలేఖరి ప్రయత్నంగా ఈ వార్తను పొందుపరచడం జరిగింది. ఇప్పటి కైనా విద్యుత్ మరియు కాంట్రాక్టర్లు తక్షణమే స్పందించి నాకు అనగా విద్యుత్ పోల్‌కు మరమత్తులు చేయించి నన్ను యదావిధిగా వుండే విధంగా చేయండి, ప్రజల ప్రాణాలను రక్షించండి అని విద్యుత్ అధికారులను కోరుతున్నాను.
Read also : బ్రేకింగ్ న్యూస్… గుండెపోటుతో రైతు మృతి!
Read also : బ్రేకింగ్ న్యూస్!.. స్కూటీ పై వచ్చి ఎంపీ గోల్డ్ చైన్ ను దొంగలించిన దుండగులు!