
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- ప్రస్తుత కాలంలో ప్రజలు అనూహ్య కారణాలతో మృతి చెందుతున్న ఘటనలు ప్రతిరోజు చూస్తూనే ఉన్నాము. నవ్వుతూ ఆనందంగా కనిపిస్తూ ఉన్న వ్యక్తి.. మన కళ్ళ ముందే మృతి చెందితే ఎవరికైనా మైండ్ పోవాల్సిందే. అయితే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కేవలం చికెన్ ముక్క గొంతులో ఇరుకపోవడం వల్ల ఒక మనిషి నిండు ప్రాణం క్షణాల్లోనే పోయింది. ఇక అసలు వివరాల్లోకి వెళితే.. సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట మండలం, గొల్లపల్లి గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. సురేంద్ర అనే ఒక వ్యక్తి ఆదివారం కావడంతో చికెన్ తీసుకుని వచ్చి వండుకొని హ్యాపీగా తిందామని అనుకున్నాడు. అయితే మృత్యువు అతనికి చికెన్ ముక్క రూపంలో వచ్చింది అని అర్థం కాలేదు. చికెన్ ను తింటూ ఉండగా ఒక్కసారిగా ముక్క గొంతులో ఇరుక్కుపోయింది. ఇక వెంటనే ఊపిరి ఆడకపోవడంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. ఇక ఈ ఘటనతో గ్రామంలోని ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయారు. ఈ మధ్యకాలంలో గొంతులో చికెన్ ముక్క లేదా గుడ్డ ముక్కలు ఇలాంటివి ఇరుక్కొని చనిపోయిన సంఘటనలు సోషల్ మీడియాలో వస్తునే ఉన్నాయి. దీంతో ఇలాంటివి తినేటప్పుడు కాస్త జాగ్రత్తని అధికారులు హెచ్చరిస్తున్నారు. మృత్యువు ఏ రూపంలో వస్తుందో తెలియదు కాబట్టి ప్రతి క్షణం కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు.
Read also : 25 కాదు..12నే విడుదల చేయాలని బాలకృష్ణ ఫ్యాన్స్ డిమాండ్!
Read also : ఈ రెండేళ్లలో మోసం చేయడం, దోచుకోవడంమే జరిగింది : బీజేపీ నాయకులు





