Sunday, February 15, 2026
Homeక్రీడలుకఠినమైన డైట్ ఫాలో అవుతున్న విధ్వంసకర ప్లేయర్..?

కఠినమైన డైట్ ఫాలో అవుతున్న విధ్వంసకర ప్లేయర్..?

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- T20 వరల్డ్ కప్ లో భాగంగా భారత జట్టు తరుపున ఓపెనర్ గా వచ్చి దుమ్ము దులుపుతున్నటువంటి యువ క్రికెటర్ అభిషేక్ శర్మ తీవ్రమైన కడుపు నొప్పితో ఆసుపత్రి పాలైన విషయం తెలిసిందే. అయితే తాజాగా కడుపు నొప్పికి చికిత్స చేసిన అనంతరం అభిషేక్ శర్మ డిశ్చార్జ్ అయ్యారు. డిస్చార్జ్ అయిన వెంటనే స్టార్ బౌలర్ అర్షదీప్ సింగ్ తన సోషల్ మీడియా వేదికగా అభిషేక్ శర్మ హెల్త్ గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది అని బౌలర్ అర్షదీప్ సింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మను అడగగానే.. ఇప్పుడు నా ఆరోగ్యం చాలా బాగుంది అని… కఠినమైన డైట్ ఫాలో అవుతున్న అని వివరణ ఇచ్చారు. ఈ కఠినమైన డైట్ ఫాలో అవుతున్న కారణంగానే ఇప్పటిదాకా రెండు కేజీలు బరువు తగ్గాను అని తెలిపాడు.

మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ బలపడింది

అర్షదీప్ సింగ్ తన మొబైల్లో అభిషేక్ శర్మ మాట్లాడిన విషయాన్ని అంతా కూడా తన సోషల్ మీడియా వేదిక లో భాగంగా అప్లోడ్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా బాగా వైరల్ అవుతుంది. ఇక రేపు భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఉత్కంఠ భరితమైన మ్యాచ్ జరగబోతున్న నేపథ్యంలో మరి ఈ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆడుతారా లేదా అనేది కూడా మనకి స్పష్టంగా తెలియాల్సి ఉంది. బయట ఫ్యాన్స్ అయితే అభిషేక్ శర్మ పాకిస్తాన్ తో జరగబోయే మ్యాచ్లో కచ్చితంగా ఆడే విధంగా చూడాలి అని.. పాకిస్తాన్ కు చుక్కలు చూపించాలి అని.. ఓపెనర్స్ గా అభిషేక్ శర్మ అలాగే ఇషాన్ కిషన్ ఉంటే కచ్చితంగా పాకిస్తాన్కు చుక్కలు కనబడతాయి అని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. మరి అభిషేక్ శర్మ రేపు జరగబోయే మ్యాచ్లో ఆడుతారా లేదా అనేది మరికొద్ది సేపట్లో తెలియనుంది.

మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ బలపడింది

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments