-
హాజరైన సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి
క్రైమ్ మిర్రర్ (తుర్కెమ్జాల్): కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, రాజకీయ ప్రముఖుల సమక్షంలో బాణాల అవినాష్, కృతి నిశ్చితార్థ వేడుక శుక్రవారం ఘనంగా జరిగింది. తుర్కెమ్జాల్లోని అరుణ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన, ఈ వేడుక ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగింది. నల్లగొండ జిల్లా చింతపల్లి మండల సీపీఐ సహాయ కార్యదర్శి, ఉజ్జిని అంజన్ రావు మేనల్లుడు బాణాల అవినాష్, కృతిల నిశ్చితార్థ కార్యక్రమానికి, పలువురు రాజకీయ ప్రముఖులు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకకు సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి, ముఖ్య అతిథిగా హాజరై అవినాష్, కృతిలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వేడుకలలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరి రావు, బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రవీందర్ కుమార్ నాయక్, వివిఆర్ ఫౌండేషన్ చైర్మన్, ప్రముఖ వ్యాపారవేత వరికుప్పల వెంకట్ రాములు నూతన జీవితంలోకి అడుగుపెట్టనున్న జంటకు ఆశీస్సులు అందజేసి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. ఆతిథ్య మర్యాదల మధ్య నిశ్చితార్థ వేడుక వైభవంగా సాగింది. రాజకీయ, సామాజిక రంగాలకు చెందిన ప్రముఖుల రాకతో, ఈ వేడుక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అవినాష్, కృతిల నూతన జీవితానికి బంధువుల నోట శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ కార్యక్రమంలో విద్యా సాగర్ రావు, ఉజ్జిని హనిష్ రావు, ఉజ్జిని రత్నాకర్ రావు, పల్లా రంగారెడ్డి, తడకమల్ల శ్రీనివాస్ తదితరులు వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.
