Homeసినిమావారణాసి నుంచి బిగ్ అప్డేట్!

వారణాసి నుంచి బిగ్ అప్డేట్!

క్రైమ్ మిర్రర్, సినిమా:- దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’పై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సినిమా తాజా అప్‌డేట్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు చిత్రబృందం కీలక సమాచారం అందించింది. ‘వారణాసి’ షూటింగ్ ప్రక్రియ పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన సీజీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో విజువల్ ఎఫెక్ట్స్‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. త్వరలోనే డబ్బింగ్ పనులను కూడా ప్రారంభించనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.మహేష్ బాబు సరసన ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. విభిన్న లొకేషన్లు, భారీ యాక్షన్ హంగులతో రూపొందుతున్న ఈ సినిమాను తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 2027 ఏప్రిల్ 7న ఉగాది కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే, విజువల్ ఎఫెక్ట్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల భారీతనం దృష్ట్యా విడుదల తేదీపై ఇండస్ట్రీలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మరోవైపు, రిలీజ్‌కు ముందే ‘వారణాసి’ థియేట్రికల్, డిజిటల్ హక్కుల విషయంలో భారీ రికార్డులు సృష్టిస్తూ ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. రాజమౌళి మార్క్ విజువల్ వండర్‌గా రాబోతున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

షుగర్, బీపీ అదుపులో ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు